21, సెప్టెంబర్ 2026, సోమవారం

అమ్మమ్మ బంగారం అందరికి బహుమానం

అమ్మమ్మ బంగారం అందరికి బహుమానం 
అమ్మంటే అనురాగం అందరికి మమకారం 

అమ్మమ్మ ఆశ్రయం అందరికి ఆనందం 
అమ్మయే ఆధారం అందరికి ఆదర్శం  

అమ్మమ్మ ఆదేశం అందరికి ఆదరణం 
అమ్మలో ఉపదేశం అందరికి సహకారం 

అమ్మమ్మ సామర్థ్యం అందరికి సమర్థం 
అమ్మయే శ్రమించడం అందరికి ఆశ్చర్యం 

అమ్మమ్మ గుణపాఠం అందరికి విజ్ఞానం 
అమ్మలో శ్రమకార్యం అందరికి ఆరోగ్యం 

అమ్మమ్మకే అమ్మంటే అపారమైన ఆత్మీయతం 
అమ్మకే ఆమ్మమ్మంటే అనంతమైన అభిమానం 

అమ్మమ్మకే అమ్మ తోడుగా ఉండాలి సమయానికే తెలియాలి 
అమ్మకే అమ్మమ్మ తోడుగా రావాలి సహనానికే తెలియాలి 

అమ్మమ్మ ఆభరణం అమ్మకే ఆ భాగ్యం కలగాలి కలకాలం 
అమ్మ సౌభాగ్యం అమ్మమ్మకే ఆ శాంతం మెలగాలి చిరకాలం 

అమ్మమ్మ ప్రశాంతం ఆయుస్సుతో సమాప్తం కాల గమనం (వయస్సుకే వందనం - త్యాగానికే తోరణం)
అమ్మ ప్రభాతం ఉషస్సుతో సమస్తం కార్య చరణం (మనస్సుకే ఆహ్వానం - గృహానికే పోషణం)

మనస్సులో ఏముందో వయస్సుకే తెలియాలి (విజ్ఞానం ఉండాలి)
వయస్సులో ఏముందో మనస్సుకే తెలియాలి (అనుభవం ఉండాలి)

మనస్సు వయస్సు తెలిసాక విజ్ఞానంతో పాటు ఆరోగ్యం సామర్థ్యం సంపాదన సౌకర్యం అభివృద్ధి ఉండాలి అప్పుడే మనస్సు వయస్సు సరిగ్గా సమపాలలో భవిష్య కాల జ్ఞానంతో జీవన పరిస్థితులతో అన్యోన్యంగా జీవిస్తాయి 

అమ్మమ్మ బంధానికి అమ్మ సంబంధానికి కుటుంబం సంతోషంగా ఉంటేనే బంధుత్వాలు కలిసిపోతుంటాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి