1, సెప్టెంబర్ 2026, మంగళవారం

భూవరహా స్వామీ భూదేవితో ఉన్నావా భూమి భారాన్ని మోస్తున్నావా

భూవరహా స్వామీ! భూదేవితో ఉన్నావా భూమి భారాన్ని మోస్తున్నావా 
భూమితో ఉన్న వారిని మార్చేస్తూ భూలోకాన్ని గిరగిరా తిప్పుతున్నావా 

భూలోకమంతా తిరుగుతూనే ఎందరినో మార్చేస్తూ ఆడిస్తున్నావా  
లేని వాడిని ఉన్న వాడిగా ఉన్న వాడిని లేని వాడిగా మార్చేస్తున్నావా 

భూమి లేకున్నా కనకము లేకున్నా సిరిసంపదలు లేకున్నా జీవించుటలో నిలిచేందుకైనా భూ ప్రదేశమైన ఉండాలిగా 
మనస్సు లేకున్నా భావం లేకున్నా స్వభావతత్వాలు లేకున్నా జీవించుటలో ఉండేందుకైనా సమయభావమైన  ఉండాలిగా 

భూమితో ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు భూమితో లేనివాడు శ్రామికుడు భూమితో అటుఇటు కానివాడు భ్రమకుడు 
ప్రతి మానవుడు స్వతహమైన భూమి కావాలని స్వగృహంలో జీవించాలని శ్రమిస్తూనే అటుఇటు ఐనవాడు నష్టకుడు  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి