Wednesday, May 27, 2026

ఆనాడు మనవారు నేర్చుకున్న జీవన విధాన చేతి వృత్తులే నేడు యంత్రాలు సాగిస్తున్నాయి

ఆనాడు మనవారు (మానవులు) మేధాశక్తితో నేర్చుకున్న జీవన విధాన చేతి వృత్తులే నేడు యంత్రాలు సాగిస్తున్నాయి  - యంత్రాలను సృష్టించినది సృష్టిస్తున్నది కూడా మానవులే 

జీవనోపాధికై నేర్చుకున్న అనేక చేతి వృత్తులు శ్రమతో పాటు విజ్ఞానాన్ని ఆదాయాన్ని ఆర్జించాయి 

చేతి వృత్తుల విధానాలను క్రమణీకరణ పద్ధతులతో నేటి యంత్రాలకు క్రమీకరణగా అమర్చుతూ ఎన్నో ఉత్పత్తులు సాగుతున్నాయి 
యంత్రాలలో ఎన్నో భాగాలు వివిధ రకాల కార్యక్రమాలను క్రమంగా సాగిస్తూ సరైన విధంగా క్రమీకరణ చేస్తూ ఉత్పత్తులు జరగుతున్నాయి 

మానవుని సామర్థ్యం సహనం కొంత సమయానికి తగ్గిపోవుటచే యంత్రములు చాలా సమయానికి పనిచేసే విధంగా మహా గొప్ప యంత్రాలను సృష్టించుకున్నాడు 

యంత్రములే మరో యంత్రములకు కావలసిన వివిధ భాగాలను ఎన్నో పరిమాణాలలో సృష్టిస్తున్నాయి 

ఒక పరికరాన్ని సృష్టించుటకు ఎంత సమయం పడుతుందో అలాంటి పరికరాన్ని అనేకంగా సృష్టించుటకు (తయారు చేయుటకు) కూడా యంత్రములు పనిచేసే సమయం అంతే సమ వ్యవధి పడుతుంది 

మానవుడు పరికరాలను (పనిముట్లను) లేదా వస్తవులను  సృష్టించుటలో లేదా తయారు చేయుటలో కొన్ని నిమిషాల వ్యత్యాసం ఉండవచ్చు అలాగే రోజుకు తయారుచేసే లేదా ఉత్పత్తి చేసే సంఖ్య తక్కువగా ఉండవచ్చు 

మానవుడు కొంత సమయానికి సహనాన్ని కోల్పోయి విశ్రాంతి లేదా ఆహారాన్ని తీసుకుంటాడు లేదా ఇతర కార్యాలతో కొంత సమయం సాగిపోగలడు - యంత్రములైతే ఇంధనం ఉన్నంతవరకు చాలా సమయం ఒకే విధంగా పనిచేస్తూనే ఉంటాయి 

యంత్రాల ఉత్పత్తులలో ఆకర్షణీయత ఉపయోగం ఉండవచ్చు అలాగే ధరలు కూడా చాలా ఉండవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment