అనారోగ్యంతో మరణించగలనేమోనని సూర్యోదయంతో సూర్యున్ని ప్రార్థిస్తున్నా
ఓ సూర్య దేవా! సకల జీవరాసులు జీవించుటకు నీవే ప్రధానమైన కారణ మూర్తివి
అనంతమైన బ్రంహాండంలో వివిధ రకాల ప్రకృతిలో సకల జీవరాసులకు ఆహారం సామర్థ్యం ఆలోచన విచక్షణం కార్యక్రమ విధానం కార్యకారణ గమన విజ్ఞానం రూపకల్పన పరిశోధనం కల్పిస్తున్నావు
నీ ప్రజ్వలమైన ప్రకాశవంతమైన కాంతి కిరణాల స్పర్శచే దేహం ఆరోగ్యవంతమై మేధస్సు ఉత్తేజమై ఆలోచనలతో విచక్షణ జ్ఞానాన్ని పరిశోధనం చేస్తున్నది నేత్ర దర్శనంతో మేధస్సు ఆకాశమంతా విహరించే భావోదయమై జగమంతా జీవించే తత్వమై మహా జీవితాన్ని సాగిస్తున్నది
వెలుగుతోనే జన్మించిన నీవు ప్రజ్వలమై సకల జీవరాసులకు నేత్రంతో రూపాకారాన్ని కలిగించి వెలుగులో విజ్ఞానంగా జీవించుటకు బంధాలను సృష్టిస్తున్నావు కాలాన్ని జీవితాలుగా సాగిస్తున్నావు సమయాన్ని నీవే రెండుగా మార్చుకుంటూ పరిభ్రమణం చెందుతున్నావు
జీవించుటలో శ్రమ వలన కలిగే అనారోగ్యాన్ని నీవే సూర్యోదయంతో నీ ప్రజ్వల కాంతితో ఆరోగ్యంగా మార్చేలా
దేహానికి వైద్యం అందించాలి శరీరానికి ఔషధాన్ని కల్పించాలి మేధస్సును మహోదయంగా ప్రభవింపజేయాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment