పద్మనాభ మహాభళా! బ్రంహపాద విష్ణుభళా!
జీవరూప బ్రంహభళా! పద్మరూప జీవభళా!
విష్ణునాభ రూపభళా! నాభిరూప పద్మభళా!
దేహరూప సృష్టిభళా! దైవరూప దేహభళా!
కాలరూప జ్ఞానభళా! కాలజ్ఞాన కార్యభళా!
దైవరూప విశ్వభళా! విశ్వసృష్టి మహాభళా!
శ్వాసరూప నాభిభళా! ధ్యాసరూప జ్ఞానభళా!
నాభిరూప ధాత్రిభళా! ధాత్రిరూప సృష్టిభళా!
కార్యరూప కీర్తిభళా! శ్రమరూప సర్వభళా!
సర్వరూప బ్రంహభళా! బ్రంహరూప ఖ్యాతిభళా!
విశ్వరూప నేత్రభళా! భావరూప దివ్యభళా!
దివ్యరూప కాంతిభళా! కాంతిరూప తత్వభళా!
పూర్వరూప వృద్ధిభళా! కాలరూప రక్షభళా!
ధైర్యరూప ధర్మభళా! ధర్మరూప ధాత్రిభళా!
అవధూత శిల్పిభళా! అవధాని ధ్యాసభళా!
వేదజ్ఞాన వ్యాసభళా! వీణవాణి శ్వాసభళా!
పరమాత్మ ఆత్మభళా! పరఆత్మ సిద్ధిభళా!
సిద్ధిబుద్ధి యోగిభళా! మహాయోగ శాంతిభళా!
సూర్యరూప కాంతిభళా! భవరూప నాభిభళా!
నాభిరూప బ్రంహభళా! బ్రంహరూప బ్రంహాండభళా!
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment