ఏ ఇంటి పరిస్థితి ఎవరికీ తెలుసు దేవా!
ఏ జీవి పరిస్థితి ఎవరికీ తెలుసు దేవా!
ఏ ధ్యాస పరిస్థితి ఎవరికీ తెలుసు దేవా!
ఏ శ్వాస పరిస్థితి ఎవరికీ తెలుసు దేవా!
ఎవరి పరిస్థితి ఎవరికి తెలిసినా ఎవరికి వారే శ్రమించి సాధనచే సహించుటయే నీ దేహ స్వభావ తత్వాల మనస్థితి దేవా! || ఏ ఇంటి ||
ఎదుగుటలో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ఒదుగుటలో తెలిసినది నీ పరిస్థితి దేవా!
ఉదయించుటలో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
అస్తమించుటలో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
పరిశోధనలో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
పరిశుద్ధతలో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
సమస్యలతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
సమయంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
విజ్ఞానంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
విచారణతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
పరిస్థితులన్నీ కాలంతో సాగే కార్యములచే ఏర్పడుతూ బంధాలతో ఎన్నో విధాలుగా మారుతూపోయేను దేవా! || ఏ ఇంటి ||
ఆచరణతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ఆశ్రయంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ప్రయాణంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ప్రబంధంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
కార్యములతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
కారణములతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
అనుభవాలతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
అనుబంధాలతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ప్రశాంతతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
ప్రభాతంతో తెలిసినదా నీ పరిస్థితి దేవా!
పరిస్థితులన్నీ ఆనాటి బంధాలతో సాగుతూ నేటి కొత్త సంబంధాలతో మారిపోతూ ఎన్నో విధాలుగా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి దేవా! || ఏ ఇంటి ||
No comments:
Post a Comment