ఆధునిక విజ్ఞాన యుగంలో ఎన్నో రకాల మార్పులు ఊహించని విధంగా కలుగుతున్నాయి
యంత్రాలతోనే అన్నీ జరిగిపోయేలా అన్నీ సమకూరేలా అన్నీ సాగించేలా ఆధునిక విజ్ఞానం సాగుతున్నది
చేతి యంత్రాలతోనే కాలక్షేపం సంపాదన పరిచయాలు ప్రకటనలు వ్యాపార లావాదేవీలు రవాణా కార్యాలు చిత్రములు సంతోషాలు ఆహారం ఆరోగ్యం విజ్ఞానం సంపాదన ఐశ్వర్య అభివృద్ధి ప్రయాణాలు శిక్షణ భక్తి ఆభరణం వస్త్రాలు వస్తువులు అలంకారణాలు జీవించుటకు కావలసిన మొదటి నుండి చివరి దాకా అన్నీ వచ్చేస్తున్నాయి
ఉద్యోగాలలో కూడా ఎన్నో యంత్ర విధాన మార్పులు ఆసక్తి కరంగా సంపాదనలు కాలక్షేప దృశ్యములు మాయా మంత్ర రూపములుగా వస్తున్నాయి
యంత్ర విజ్ఞానాన్ని కొందరు సంపాదనకై ఉపయోగించుకుంటున్నారు మరెందరో విజ్ఞానం సమయం ఉన్నా కాలక్షేపంతో వృధా చేసుకుంటున్నారు
కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఏ విధమైన ఉద్యోగాన్నైనా చేసుకోవాలి అవసరాలను సౌకర్యంగా చేసుకోవాలి
యవ్వనంలో సౌకర్యాలు లేకున్నా శ్రమించగలవు వృద్ధాప్యంలో సౌకర్యాలు లేకపోతే చూసేవారు ఎవరు పలకరించేది ఎవరు
నీ దేహాన్ని శరీరాన్ని ప్రతి రోజు శుభ్రంగా సులభంగా ఉంచుకోవడమే సౌకర్యం
నీ మేధస్సును ఉత్తేజంగా ఆలోచిస్తూ సమస్యలను పరిష్కారించుకోవడమే విజ్ఞానం
నీ శరీరం తాజావంతమైన ఆహారంతో సమపాలలో సేవిస్తూ శ్రమించడమే ఆరోగ్యం
సరైన ఆహారం సరైన సామర్థ్యం సరైన ఆలోచన సరైన విజ్ఞానం సరైన నిద్ర కలిగి ఉండడమే ప్రశాంతం (ప్రశాంతత)
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి