ఉద్యోగం లేదని అనుకోవద్దు ఎక్కడ ఉందో తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నావు
ప్రయత్నం చేయలేదని ఏనాడు అనుకోవద్దు సమయమే నీలో అన్వేషణలో ఒక చోట చూపిస్తుంది
ఒక వాక్యమే తెలుసుకో ఆ వాక్యాన్నే గుర్తుచేసుకో ఆ వాక్యాన్నే తెలుపుకో అక్కడే ఉద్యోగం వస్తుంది
వాక్యాన్ని వివరంగా తెలుసుకో వాక్యాన్ని విభజిస్తూ గుర్తుచేసుకో వాక్యాన్ని వివరిస్తూ తెలుపుకో ఉద్యోగం ఏమని తెలుస్తుంది
ప్రయత్నించావని సాగిపోతున్నావు తెలిసినవన్నీ మళ్ళీ తెలుసుకుంటున్నావు వాటినే మళ్ళీ తెలుపుకుంటున్నావు
తెలుసుకుంటూనే ఉద్యోగం చేస్తున్నావు ప్రయత్నిస్తూనే సాగిపోతున్నావు సమయమే నీకు తెలియకుండా పోతున్నది
ఉద్యోగంలోనే ఉన్నావు ఎన్నో తెలుసుకుంటున్నావు జీవితాన్ని సంపాదనతో సాగిస్తున్నావు అభివృద్ధి చెందుతున్నావు
మళ్ళీ క్రొత్త వాటికై ప్రయత్నించు మళ్ళీ క్రొత్త వాటిని తెలుసుకో మళ్ళీ ఉద్యోగం చేస్తూనే ఉంటావు
తెలియనిది క్రొత్తది కాదు మరచిపోయినది వివరంగా తెలియనిది గుర్తు చేసుకోలేనిది జ్ఞాపకం కానిది
ఉద్యోగంతో జీవిస్తున్నావు అవరమైన వాటిని సమకూర్చుకుంటుంన్నావు కుటుంబాన్ని పోషిస్తున్నావు శ్రమకు అండగా ఉన్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి