31, ఆగస్టు 2026, సోమవారం

ఎక్కువగా సంపాదించే వారి కార్యాలను యంత్రాలే చేసిపెడుతున్నాయి

ఎక్కువగా సంపాదించే వారి కార్యాలను యంత్రాలే చేసిపెడుతున్నాయి 
యంత్రాలు పని చేయకపోతే యంత్రాలను మరమ్మత్తులు చేసేవారు కూడా వున్నారు  

యంత్రాలను కూడా సులుభంగా మరమ్మత్తు చేసే యంత్ర పరికరములు చేతి పనిముట్టులు అందుబాటులో ఉన్నాయి 
కావలసిన యంత్ర సామగ్రిని (యంత్ర భాగాలను) సృష్టించుకోవచ్చు అలాగే యంత్ర భాగాలనే బిగించుటకు కావలసిన పరికరములు పనిముట్టులను కూడా తయారుచేసుకోవచ్చు  

సంపాదన ఉన్న వారికి అన్ని రకాల అవసరాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కార్యాలు శ్రమ లేకుండా సులభంగా త్వరత్వరగా దినచర్య కార్యాలుగా యంత్రాల ద్వారా సాగిపోతాయి కార్యక్రమాలను కూడా యంత్రాలే సాగిస్తున్నాయి 

యంత్ర విధానం వలన మానవునికి స్వతహాగ ఆలోచించే విజ్ఞానం తక్కువైపోతుంది శ్రమించే సామర్థ్యం తగ్గిపోతుంది ఏకాగ్రత వినయం గమనం ఆలోచనల తెలివితేటలు తరచుగా తగ్గిపోతూ వస్తున్నాయి 

చదువుల విజ్ఞానం కూడా యంత్ర విధానం ద్వారా సాగుతూ ఉచిత విద్యను కూడా ధన రూపంగా సాగిస్తున్నారు 
ఉచిత వైద్యాన్ని కూడా యంత్ర విధానం ద్వారా ధన రూపంగా సాగిస్తున్నారు అన్ని రంగాలను పరిశ్రమలుగా ధన రూపంగా మార్చేస్తున్నారు 

ఆనాడు మనిషి రూపాన్ని ఆకారాన్ని శరీర భాగాలను గమనిస్తూ శరీరానికి ఉన్న రోగాన్ని కనిపెట్టేవారు 
ఈనాడు మనిషి రూపాన్ని ఆకారాన్ని గమనించకుండా శరీరంలో ఉన్న సూక్ష్మ కణాలను యంత్రాల ద్వారా పరిశోధన చేస్తూ తగిన వైద్య చికిత్సలను కూడా యంత్రాల ద్వారానే చేస్తున్నారు 

నేడు విజ్ఞానమే కాదు జీవన విధానమే శరీర చలనమే (శ్వాస కదలిక) మేధస్సు గమనం కూడా ఖర్చులతో సాగిపోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి