27, ఆగస్టు 2026, గురువారం

నీవు ఎవరివైనా సరే ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎందరితో ఉన్నా ఉద్యోగంతో జీవిస్తూనే సాగిపో

నీవు ఎవరివైనా సరే  ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎందరితో ఉన్నా ఉద్యోగంతో జీవిస్తూనే సాగిపో  

ఉద్యోగం లేకుండా జీవించుటలో మానవుని సమయం కాలక్షేప వృధాయే కాకుండా జీవన స్థితి అవస్థగా అనారోగ్యంతో భాగస్వామ్యం భరించలేని విధంగా సాగిపోతుంది 

మానవుని స్థితి పరిస్థితి గ్రహస్థితి విధిస్థితి మతిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అలవాటులకు కూడా అర్థం లేని విధంగా జరిగిపోతుంటాయి 

నేటి ఐశ్వర్యం ఖర్చులకు సరిపోదు నేటి విజ్ఞానం జీవన శ్రమకు సరిపోదు నేటి ఆరోగ్యం కార్యక్రమాల శ్రమకు సరిపోదు నేటి అభివృద్ధి బంధాలకు సరిపోదు నేటి జీవన విధానం మెరుగయ్యేందుకు సరిపోదు నేటి ఉద్యోగం స్వగృహానికి సరిపోదు ఐనను దినచర్య కార్యాలకు ఉద్యోగమే ప్రధాన ఆధారం ఆహారానికి మూలాధారం పరమ పర ఔషధం 
 
ఉద్యోగంతో జీవిస్తున్న నాడు తెలుస్తుంది ఉద్యోగం ఎంతటి మహత్యమో ఎంతటి పవిత్రమో 
ఉద్యోగం లేని నాడు ఉద్యోగంపై ఆలోచన లేకుండా జీవించుటలో నీవు జీవించిన విధానం ఎంతటి అకాలమో 

ఉద్యోగం లేకుండా ఏది అనుభవించినా అది మానవ దేహానికి శ్రమలేని అజ్ఞాతవాసంలో జీవించే (క్రోధ) విధానం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి