మోసం చేస్తూ సాగుటలో నీవూ మోసపోతున్నావు
మోసం చేస్తూనే నీవు ఎదగలేక ఇంకొకరిని ఎదగలేక చేస్తున్నావు
నీ మోసంతో నీ చుట్టూ ఉన్నవారిని మోసగిస్తూ వారందరూ ఇంకొకరిని మోసగించేలా చేస్తున్నారు
నీ మోసంతో అందరూ మోసంతో జీవించేలా మోసపోతూనే అభివృద్ధి లేకుండా మోసంతో సాగుతున్నారు
నీవు మోసాన్ని ఆపివేసినా మిగతావారు మోసాన్ని ఆపలేక అలాగే మోసం చేస్తూనే జీవితాన్ని సాగిస్తున్నారు
నీవు చేసే మోసం అందరికి అలవాటుగా మారిపోయి అదే జీవన విధానంగా సాగిపోయి మోసపోతూనే ఉన్నారు
ఎంత కాలం మోసపోతూ జీవిస్తూనే జీవితాలను మోసం చేసుకుంటున్నారు అభివృద్ధిని సాధించలేకపోతున్నారు
సమాజమంతా తెలియని మోసంతో అక్కడక్కడ సాగిపోతూ ఎందరో ఎదగలేక నిరుత్సాహంతో జీవిస్తూనే ఉన్నారు
మోసం ఏ విధంగా ఉంటుందో మొదటి నుండి చివరి దాక మేధస్సు కూడా గ్రహించని విధంగా దేహం మరుపుతో సాగిపోతుంది
మోసగించిన వారు కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాతనే మేధస్సుకు మోసపోయామని భ్రమగా తెలుస్తుంది
మోసపోతూ జీవించుటలో విజ్ఞానం ఉన్నా ఉపయోగం లేని విధంగా జీవన విధానం విషాదమై సాగుతున్నది
మోసపోతున్నట్లు తెలిసినా ఎన్నో అవసరాలు మోసపోవడంతోనే వివిధ కార్యక్రమాలు సాగేవిధంగా ఉంటున్నాయి
మోసం చేయకపోతే జీవన విధానం సాగనట్లుగా జీవితమే లేనట్లుగా కార్యక్రమాలు మైమరచిపోతున్నాయి
మోసంతోనే అభివృద్ధి చెందే విధంగా నేటి జీవితాలు ఎన్నో రకాలుగా వివిధ కార్యాలతో సమాజంలో అప్రమత్తంగా సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి