ఉద్యోగం లేని వారు కుటుంబంలో సంతోషంగా ఉన్నారా
ఉద్యోగం లేకుండా కుటుంబాన్ని ఐశ్యర్యంతో అభివృద్ధి చేయగలరా
ఉద్యోగం లేకుండా ఏనాడైనా కుటుంబంలో అవసరాలను తీర్చేసుకున్నారా
సంపాదన లేకుండా సౌకర్యాలను పరిశుద్ధంగా సమకూర్చుకున్నారా
కుటుంబంలో సమస్యలను పరిస్థితులను పూర్తిగా పరిష్కారించుకున్నారా
ఒక నెల (మాసము) ఉద్యోగం (సంపాదన) లేకుండా కుటుంబం ఎలా గడిచిపోతుందో మరో నెల కూడా అలాగే లేదా ఇంకా కఠినంగా గడిచిపోతుంది లేదా ఎన్నో కార్యాలతో నిలిచిపోతుంది
ఒక నెల (మాసము) ఉద్యోగంతో (సంపాదనతో) కుటుంబం ఎలా గడిచిపోతుంది మరో నెల కూడా అలాగే లేదా ఇంకా గొప్పగా సాగిపోతుంది ఎందుకంటే సంపాదనతో కార్యాలన్నీ సాగిపోతూ సమస్యలన్నీ తీరిపోతూ అవసరాలన్నీ సమకూర్చుకుంటూ సౌకర్యాలన్నీ చేసుకుంటూ అభివృద్ధితో ముందుకు సాగుతుంది ఎందుకంటే ఉద్యోగం వలన ప్రతి నెల సంపాదన వస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాలకు పెరుగుతూనే ఉంటుంది ఇబ్బందులకు సంపాదన తోడవుతూనే సమస్యలను తీర్చుకుంటూ సాగిపోవచ్చు
జీవితంలో ఉద్యోగం కన్నా పరమార్థం ఏమున్నది
ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తేనే కుటుంబం సాగిపోతుంది లేదా ఒక చిన్న సమస్యతో కార్యాన్ని సాగించలేక ఆగిపోతుంది
ప్రతి ఇంటిలో రెండు సంపాదనలు ఉంటేనే ఖర్చులు తగ్గుతాయి సంతోషాలు పెరుగుతాయి ఆరోగ్యం విజ్ఞానం అండగా ఉంటాయి అభివృద్ధి పెరుగుతుంది ఐశ్వర్యం అంతస్తులుగా ఎదుగుతుంది
ఉద్యోగం సంపాదన లేకపోతే మాటలు కూడా మారిపోతాయి మనలో లేని స్వభావాలు మనకు తెలియకుండానే క్రొత్త తత్త్వముతో వచ్చేస్తాయి
సంపాదన లేక బంధాలు కూడా విచ్చిన్నమవుతున్నాయి విచక్షణ కూడా లోపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి