19, ఆగస్టు 2026, బుధవారం

ఓ మహాదేవి! గర్భగుడిలో ఉన్న నీవు క్షేమమా నిశ్చలమై పోవుటలో సౌఖ్యమా

ఓ మహాదేవి! 
గర్భగుడిలో ఉన్న నీవు క్షేమమా నిశ్చలమై పోవుటలో సౌఖ్యమా 
గర్భగుడిలో ఉన్న నీవు కాంతమా అచలమై ఉండుటలో శాంతమా 

ఆలయంలో ఉన్న నీవు దైవమా దేహంలో ఉన్న నీవు ధైర్యమా 
ఆవరణంలో ఉన్న నీవు ధర్మమా శరీరంలో ఉన్న నీవు సామర్థ్యమా 

దేవాలయంలో ఉన్న నీవు మహాదేవి స్వరూపమా మహా మంగళ కారుణ్యమా 
దైవాలయంలో ఉన్న నీవు మహాభాగ్య స్వరూపమా మహా అంగళ ప్రశాంతమా 

జగతికే జగన్మాత విశ్వతికే విశాలాక్షి ప్రకృతికే పరాశక్తి ఆకృతికే ఆరాధ్యశక్తి 
జాగృతికే జన్మధాత్రి స్రవంతికే జలధాత్రి ప్రఖ్యాతికే స్వరధాత్రి ప్రగతికే ప్రభధాత్రి 


-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion