భూ ప్రదేశం ఒకరిది అంతస్తులు (గృహములు) ఇంకొకరివి గృహములను సంరక్షణ చేసేవారు మరొకరు
భూమి నీది కాదు అంతస్తులలో ఉన్న ఇండ్లలో ఒక ఇల్లు నీవు కొనగలిగితే ఆ ఇల్లు నీదైనా దానికి సంరక్షణగా మరొకరు ఉంటారు వారికీ నీవు నెలసరి జీతాన్ని అందించాలి (వేతనం చెల్లించాలి)
ఇల్లు నీదైనా వేతనం చెల్లించుటలో ఎటువంటి మర్మం ఉన్నదో గాని ఐశ్వర్యం ఖర్చుతో కాకుండా శ్రమతో కూడా ఖాళీ అవుతూ జీవితాన్ని శూన్యం చేస్తున్నది
నీవు జీవించుటకు కూడా నీవు కొన్న ఇంటిలో ఉంటూ వేతనం చెల్లిస్తూ నీ పరిధిలో శ్రమిస్తూ ఖర్చులతో నెల నెల మోసపోతూ ఉండాలి
నీవు ఇంటిని కొనడమే కాకుండా నెల నెల అద్దె కడుతున్నావు శ్రమను ధార పోస్తున్నావు జీవితం ఒకరి చేతిలో చిక్కిపోయినట్లుగా సాగుతున్నది
నగరంలో జీవించుటకు స్థలమైనను లేదు అంతస్తులలో జీవించుటకు కూడా సామాన్యులకు అందుబాటులో లేవు
రహదారిని నిర్మించుకొని ఇండ్లతో జీవనం సాగించుటలో నేర్చినది నగరం నడచుటకే గాని ఉండుటకు లేదు జీవించుటకు లేదు నిద్రించుటకు లేదు మిత్రమా
శ్రమించ గలిగితే కొంత సమయం ఉండగలవు అభివృద్ధి చెందితే కొంత కాలం ఉండగలవు నిరాశ చెందితే నడుచుకుంటూ ఆగిపోగలవు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి