27, ఆగస్టు 2026, గురువారం

ఏమీ తోచని సమయంలో ఏమీ చేయాలో మేధస్సు తెలుపకపోతే ఆలోచనకు తెలిసేదెలా

ఏమీ తోచని సమయంలో ఏమీ చేయాలో మేధస్సు తెలుపకపోతే ఆలోచనకు తెలిసేదెలా  
ఏమీ తోచని సమయాలు ప్రతి రోజూ కలిగితే మేధస్సు పని చేయడం ఆగిపోతుందేమో ఎలా 

అందుకే శరీరం శ్రమిస్తూనే ఉండాలి పూటకు పరిశుద్ధమైన ప్రకృతి ఆహారాన్ని సేకరిస్తూనే ఆలోచిస్తూ ఉండాలి 
శరీరం శ్రమించకపోతే మేధస్సులో కాలక్షేపం ఏదో ఒకదానిపై సాగిపోతూ కొంత సమయానికి విసుగు కలుగుతుంది 
మేధస్సుకు భారం కలుగుతుంది శ్రమించడం లేక ఆలోచించడం మానేస్తూ వస్తుంది శరీరానికి అవస్థ ఏర్పడుతుంది 

శరీరం శ్రమించకపోతే మీ దేహంలో ఎన్నో ప్రక్రియలు ఆగిపోయి ఎన్నో కణాలు చలనం చెందక విరుద్ధంగా ప్రవర్తిస్తాయి 
ప్రతి కణం శ్రమిస్తూ ఉంటే మనలో తెలియని కొత్త పదార్ధం ఏర్పడుతూ విశుద్ధమైన పదార్ధం ఉంటే అది కరిగిపోతూ చమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది శరీరాన్ని ఉత్తేజంగా మార్చేస్తుంది మేధస్సును గొప్ప ఆలోచనలతో సాగిస్తుంది 

శరీరానికి ఆహారం సాధారణంగా పూటకు సరైన సమయానికి ఆస్వాదించే విధంగా ఉండాలి 
సాధారణంగా కాకుండా అలవాటుగా సమయ సందర్భం లేకుండా ఆహారాన్ని ఆస్వాదిస్తే అలవాటుగా సాగిపోయి అనారోగ్యంతో శరీరం చెడిపోతుంది మేధస్సు ఆలోచిండంలో మార్పు కలుగుతుంది 

ఆహారం ఉంటేనే మేధస్సు ఆలోచించేలా వివిధ రకమైన అలవాటు ఏర్పడుతుంది అలాగే శరీరానికి ఎటువంటి  ఆహారం కావాలో కూడా తెలియకుండా పోతుంది శరీరాన్ని నశింపజేసే అలవాట్ల పదార్థాలపై ఆధారపడి జీవించడం జీవన విధానం సాగించడం అవస్థమైన అలవాటుగా మారిపోతుంది జీవితమంతా అశుద్ధతతో సాగిపోతుంది చుట్టూ ఉన్నా ప్రదేశమంతా అశాంతమై కాలుష్యంతో ముంచి (ఆవహించి) వుంటుంది ఇతరులు జీవించడానికి కూడా వీలు లేకుండా పోతుంది అందరికి అనారోగ్యం కలిగే ప్రభావం ఏర్పడుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి