పరమాత్మ! నీవు ఏ దృశ్యాన్ని తిలకిస్తూ జీవిస్తున్నావో
ఏ దృశ్యాన్ని ఎలా చూస్తూనే నిశ్చలమై నిలిచిపోయావు
ఏ స్వభావ తత్త్వాలతో ఏ రూపం ఏ విధమైన విజ్ఞానాన్ని బోధిస్తున్నదో
ఏ లక్షణ గుణాలతో ఏ రూపం ఏ విధాన ప్రభావాన్ని ఎలా మార్చుకుంటుదో
రూపాలన్నీ కార్యాల ప్రభావాలతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులతో ఎన్నో సందేహాలను కలిగిస్తూ అజ్ఞాన విజ్ఞానాన్ని మిలితం చేసినట్లుగా ముడిపడి ఉన్నాయి
విజ్ఞాన స్వభావం అజ్ఞాన తత్త్వం ఇరుముడి వేసినట్లుగా ఒకే రూపంలో ప్రతి రూపంలో ఇమిడిపోయి ఉన్నాయి
హితాన్ని గ్రహించే మేధస్సే హింసను కూడా గ్రహిస్తుంది గమనిస్తుంది ఆలోచిస్తుంది పరిశోధిస్తుంది
విజ్ఞానాన్ని గమనించే మేధస్సే అజ్ఞానాన్ని కూడా అవగాహన చేస్తూ అయోమయంతో సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి