చేసిన తప్పును మౌనంతో సరిచేస్తావో శ్రమతో సరిచేస్తావో ఐశ్వర్యంతో సరిచేస్తావో
జరిగిపోయిన తప్పులను సరిచేసే అవకాశం వీలుంటే ఎలాగైనా సరిదిద్దుకోవాలి
పొరపాట్లు కూడా జరిగిపోతుంటాయి అలవాట్లుగా కూడా సాగిపోతుంటాయి తడబాట్లతో కూడా కలుగుతుంటాయి
తెలిసి తెలియకుండా వివిధ సమయాలలో వివిధ ప్రభావాలతో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి
ఎన్నో కార్యాలతో ఎన్నో స్వభావాలతో ఎన్నో ఆలోచనలతో ముడిపడుతూ తప్పులెన్నో సాగిపోతాయి
విజ్ఞానంతో ఉన్నా అజ్ఞానంతో సాగేలా ఎన్నో విధాల ఎన్నో కార్యాలు మాయా ప్రభావంతో తప్పులెన్నో జరిగిపోతుంటాయి
ప్రణాళికతో ఉన్నా ప్రశ్నార్థంతో సాగేలా ఎన్నో కార్యాలు సరైన క్రమం లేకుండా మైమరుపులతో అజ్ఞాతమై సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి