4, నవంబర్ 2026, బుధవారం

సూర్యోదయమా! ఏనాడు ఏ సమయాన మేల్కొన్నా ఆనాడు ఏ ప్రమాదాన్ని కలిగించవద్దు

సూర్యోదయమా! ఏనాడు ఏ సమయాన మేల్కొన్నా ఆనాడు ఏ ప్రమాదాన్ని కలిగించవద్దు ఏ మరణాన్ని సృష్టించవచ్చు 
సూర్య దేవా! ప్రతి రోజు మేల్కొనుటలో ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవద్దు ఎటువంటి మరణాన్ని సృష్టించవద్దు  

మేల్కొనుటలో శరీరానికి అపారమైన శక్తి సామర్థ్యాలను ఆరోగ్యాన్ని కలిగించు శుభ కార్యములను సాగించు 
మేల్కొనుటలో మేధస్సుకు ఎటువంటి అజ్ఞానాన్ని కలిగించవద్దు శరీరానికి ఎటువంటి అనారోగ్యాన్ని కలిగించవద్దు 

మరణాన్ని వృద్ధాప్య వయస్సున ఆఖరి జీవిత కాల దశమున విశ్రాంతి సమయంలో ప్రశాంతంగా కలిగించు 
మరణించుటకు ముందే తమ జీవితంలో సర్వ కార్యములను సంపూర్ణంగా ముగించేలా సమయాన్ని కలిగించు 

జీవితాన్ని విజ్ఞానంగా పరిశుద్ధంగా శ్రమ శ్రద్ధ సంపాదనతో ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైన సామర్థ్యవంతమైన అభివృద్ధితో సాగేలా బంధాల అనుబంధాల శుభ కార్యాలను కలిగించు తరతరాలకు సాగించు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion