ఇంటి కొలత మారదు మరి ఇంటి అద్దె ఎందుకు పెరుగుతుంది
ఇంటిలో వసతులు మారవు మరి ఇంటి అద్దెను ఎందుకు పెంచుతున్నారు
ఇంటిలో ఐశ్వర్యం పెరగకున్నా ఖర్చులు పెరుగుతున్నాయి ఐనా అద్దెను పెంచుతున్నారు
ఇంటిలో ఆహారానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఐనా అద్దెను పెంచుతున్నారు
ఇంటిలో అనారోగ్యం పెరుగుతుంది సామర్థ్యం తగ్గుతుంది ఐనా అద్దెను ప్రతి సంవత్సరం పెంచుతూనే సాగిస్తారు
ఇంటిలో అనాభివృద్ధి పెరుగుతుంది ఆనందం తగ్గుతుంది ఐనా అద్దెను ప్రతి సంవత్సరం పెంచుతూనే సాగిస్తారు
ప్రతి సంవత్సరం ఇంటి అద్దెను పెంచితే జీవిచడంలో అర్థం ఏముంది జీవితంలో పరమార్థం ఏమున్నది
విలాసవంతమైన జీవితాలకై ఐశ్వర్యం కోసమే అద్దెను పెంచుతున్నారు సమాజ పరిస్థితుల జీవన విధాన విజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు మానవత్వాన్ని గమనించలేకపోతున్నారు
ఒకరికి ఆశ్రయం కలిగించి ఐశ్వర్యాన్ని పొందుతున్నారు
ఆనాడు ఆశ్రయంతో పాటు జీవితాన్ని కూడా అభివృద్ధి చేసుకునేందుకు జీవన విధానాన్ని శ్రమవృత్తిని (ఉద్యోగాన్ని సంపాదనను) కల్పించేవారు కుటుంబ గౌరవాన్ని పెంచేవారు కలసిమెలసి జీవించేవారు
ఈనాడు ఉన్నవాడు ఒక వైపు లేనివాడు మరో వైపు వెళ్ళిపోతున్నారు
ఉన్నవాడు ఒక విధంగా లేని వాడు మరో విధంగా జీవించేలా జీవన విధానం విభిన్నంగా మారుతున్నది
కొందరు శ్రమతో కార్యాలను సాగిస్తున్నారు శ్రమించే వారికి కార్య ఫలితం లేదు
కొందరు యంత్రాలతో కార్యాలను సాగిస్తున్నారు యంత్రాలతో కార్యాలను సాగించే వారికి ఫలితం ఉంది
శ్రమించుటలో సహనం సామర్థ్యం తగ్గిపోతూ శరీరం అనారోగ్యం చెందుతుంది
యంత్రాలతో సులభంగా నైపుణ్యంతో పని చేస్తూ శరీరం ఆరోగ్యం చెందుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion