శరీరం సమస్యలతో అయోమయమై పరధ్యాసతో వివిధ స్వభావ తత్త్వాలతో పరమాత్మయమై విభిన్నమవుతున్నది
మేధస్సులో నిలిచిపోయిన సమస్యలు ఎన్నో ఆలోచనలకు అందని పరిష్కారాలుగా కార్య ప్రయత్నం లేక అలాగే సాగిపోతున్నాయి
జీవన విధానం కార్య శ్రమకు ఫలితం లేక దేహం సహన సామర్థ్యాలను కోల్పోతూ అనారోగ్యంతో శ్వాస ప్రయాసాలతో విచ్ఛిన్నమై జీవిస్తున్నది
జీవితమే లేని జీవన విధానం బంధమై సాగుతున్నా బాధ్యతలు ఎన్నో భారమై సాగుతూనే వేదాలుగా ప్రశ్నిస్తున్నాయి
మనిషిలో మార్పులు ఏవో ఋతువులకే తెలియని కాల ప్రభావాలు ఏవో బ్రంహాండమంతా అన్వేషిస్తున్నా నిలకడ లేని విధానం ఎన్నో కార్యాలతో సాగుతున్నది మేధస్సుకు పరిశోధనగానేమిగిలిపోతున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion