12, నవంబర్ 2026, గురువారం

ఒకరు వ్రాసుకుంటూనే ఉంటారు మీరు చదువుకుంటూనే ఉంటారు

ఒకరు (నేను) వ్రాసుకుంటూనే ఉంటారు (ఉంటాను) మీరు చదువుకుంటూనే ఉంటారు  

ఒకరు వ్రాసుకున్న విజ్ఞానాన్ని ఎందరో అర్థవంతంగా చదువుతూనే ఉంటారు 
ఎందరో చదువుకున్న విజ్ఞానాన్ని మరెందరో పరమార్థంగా వ్రాసుకుంటూ ఉంటారు 

ప్రతి ఒక్కరూ ప్రతి రోజు చదువుతూనే ఉండాలి వ్రాసుకుంటూనే ఉండాలి అప్పుడే క్రొత్త క్రొత్త ఆలోచనలతో భవిష్య కాలానికి అవసరమయ్యే విజ్ఞానం కలుగుతుంది చేసే కార్యాలలో నైపుణ్యం ఏర్పడుతుంది ఇంకా ఏదో తెలుసుకోవాలనే పరిశోధన కలుగుతుంది సాధన మొదలవుతుంది విజయానికి మార్గం ఏర్పడుతుంది 

చదువుకోవడం వ్రాసుకోవడంలో అర్థాల అవగాహన పెరిగి పరమార్థాన్ని గ్రహించి కార్యజ్ఞానాన్ని తెలుసుకుంటారు 
విజ్ఞానంగా ఎదుగుతూ ఎన్నో ప్రయోగాలతో ఉపాయాలతో జీవన విధానానికి అవసరమైన వాటిని తెలుసుకుంటారు సమకూర్చుకుంటారు విజ్ఞాన సాధనతో వివిధ రూపకల్పనలు చేస్తూ ఎన్నింటినో గొప్పగా సాధించుకుంటారు 

విజ్ఞానాన్ని చదువుకుంటూ వ్రాసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే విజ్ఞానం వృధా కాదు సమయం వృధా కాదు సాధనలో విఫలం ఉండదు అలాగే ఉద్యోగానికి భరోసా ఉంటుంది జీవితానికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది 

చదువుకున్న వారికి విజ్ఞానాన్ని వ్రాసుకునే ప్రతిభ కలిగితే వ్రాసుకుంటూనే ఉంటారు 
వ్రాసుకునే వారికి విజ్ఞానాన్ని చదువుకునే ప్రతిభ కలిగితే చదువుకుంటూనే ఉంటారు 

విజ్ఞాన ప్రతిభ ఉన్న వారు పండితులు గురువులు బోధకులు ఆచార్యులుగా ఎదుగుతూ సమాజానికి విద్యను అందిస్తూ భవిష్య కాలాన్ని విజ్ఞానంతో సంస్కారంతో క్రమశిక్షణతో ఆచరణ ప్రవర్తనతో పరిశుద్ధంగా సాగిస్తారు  

విజ్ఞానాన్ని వ్రాసుకుంటూనే ఉండాలి చదువుకుంటూనే ఉండాలి అప్పుడే విజ్ఞానం అందరికి తెలుస్తూ అందరికి ఉపయోగపడుతూ అందరు విజ్ఞానంతో ఎదుగుతూ సురక్షితంగా జీవితాన్ని సాగిస్తూ అభివృద్ధి చెందుతూ తరతరాలుగా సమస్యలను పరిష్కారించుకుంటూ బంధాల అనుబంధాలతో ఆరోగ్యంతో ప్రశాంతంగా సాగిపోతారు 

విజ్ఞానం సమస్యల పరిష్కారణ కోసమే 

ఒక విధమైన సమస్యను విశ్వమంతా పరిష్కారించు వారే మహా మేధావి [అటువంటి సమస్య మళ్ళీ రాకుండా చూసుకునే భవిష్య విజ్ఞాన మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి]

సమస్యకు విశ్వమంతా పరిష్కారం కలిగేలా శాశ్వతమైన మార్గాన్ని కనిపెట్టి తరతరాలుగా అందరికి ఆచరణలో ఉంచాలి నిరంతరం విశ్వమంతా అణువణువున నైపుణ్యంతో తనిఖీ చేస్తూనే ఉండాలి 

చదువుకోవడానికి పుస్తకం [కాగితం వ్రాసుకోవడానికి] ఎలా శాశ్వత మార్గంగా మారిందో అలాగే సమస్యలకు పరిష్కారం శాశ్వత మార్గంగా ఏర్పాటు చేసుకోవాలి 

విజ్ఞానం జీవులు జీవించడానికి విశ్వాన్ని రక్షించుకోవడానికి ప్రకృతిని అభివృద్ధి చేసుకోవడానికి ఋతువుల ప్రభావాలతో సురక్షితంగా అన్నింటిని గమనించడానికి ఉపయోగకరంగా ఉండాలి ప్రతి సమస్యను ప్రశాంతంగా ఐక్యమత్యంతో పరిష్కారించుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion