17, నవంబర్ 2026, మంగళవారం

సమయానికి శ్రమించే శ్రామికుడివో

సమయానికి శ్రమించే శ్రామికుడివో 
సామర్థ్యంతో శ్రమించే కార్మికుడివో 

కార్యాలను సమర్థంగా సాగించే సహన శీలివో 
సమయాన్ని సందర్భంగా సూచించే కార్య శ్రమవో  

కార్యక్రమాలను కార్యాశ్రమగా చేసుకొని సామర్థ్యంతో సాగించే శ్రామికుడివి నీవేనోయ్ 
కార్యక్రమాలను కార్యాచరణగా చూసుకొని సహనంతో సాగించే కార్మికుడివి నీవేనోయ్ 

కార్యక్రమాల భారాన్ని బంధంగా చేసుకొని బాధ్యతగా సాగించే సమయోచిత బహుశాలివో 
కార్యక్రమాల జ్ఞానాన్ని నైపుణ్యంగా చేసుకొని విజ్ఞానంగా సాగించే సందర్భోచిత ప్రజ్ఞాశాలివో 

ప్రపంచమంతా కనిపించే నిర్మాణములన్నీ శ్రామికుడి సామర్థ్యాల నైపుణ్య చిహ్నములేనోయ్ 
జగమంతా దర్శనమిచ్చే పరిశ్రమలన్నీ కార్మికుడి సామర్థ్యాల అనుభవ కర్మాగారములేనోయ్ 

కాలం మారిపోతూ కార్య విధానాలు మారిపోతూ కార్మికుల కార్మికవృత్తి మారిపోతూ నిర్మాణ విధానాలు కూడా మారిపోతున్నాయే 
కార్యం మారిపోతూ యంత్ర విధానాలు సాగిపోతూ శ్రామికుల శ్రమవృత్తి మారిపోతూ కట్టడముల విధానాలు కూడా 
మారిపోతున్నాయే  

జనులు జీవించుటకు వసతులు సౌకర్యాలను హుందాగా మార్చిన రూపురేఖల గృహాల నిర్మాణములు మహోత్తరములేనోయ్ 
జనులు నివసించుటకు జ్ఞాన విజ్ఞానములను భరోసాగా చేసిన విశ్వవిశిష్టతల కళాశాల నిర్మాణములు మహత్యములేనోయ్ 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion