17, నవంబర్ 2026, మంగళవారం

నా దేహంలో హృదయం ఎలా ఉందో ఎలా శ్రమిస్తుందో ఏనాడు చూడలేదు

నా దేహంలో హృదయం ఎలా ఉందో ఎలా శ్రమిస్తుందో ఏనాడు చూడలేదు 
నా శిరస్సులో మేధస్సు ఎలా ఉందో ఎలా ఆలోచిస్తుందో ఏనాడు చూడలేదు 

నా దేహంలో శ్వాస ఎలా ఉందో ఎలా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాస పడుతుందో ఏనాడు చూడలేదు 
నా శిరస్సులో విచక్షణ జ్ఞానం ఎలా ఉందో ఎలా కార్యాక్రమాలతో ఎంతగా స్పందిస్తుందో ఏనాడు చూడలేదు  

నా శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయో ఎలా పనిచేస్తున్నాయో ఎంతటి సామర్థ్యంతో ఎంతగా శ్రమిస్తున్నాయో  ఎటువంటి ప్రక్రియలను సాగిస్తున్నాయో ఏనాడు వీక్షించలేదు 

నా శరీరంలో ఎముకలు కండరాలు నరాలు ఎలా ఉన్నాయో ఎంతటి దృఢత్వంతో ఉన్నాయో ఎంతటి భారాన్ని భరిస్తున్నాయో ఎటువంటి కార్యాల స్వభావ తత్త్వాలను కలిగివున్నాయో ఏనాడు వీక్షించలేదు 

ఏ కార్యములైనా ఆరోగ్యంగా సమర్థంగా శక్తి సామర్థ్యాలతో సాగేందుకు నా శరీరం సహకరిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ నిరంతరం సాగిపోవాలి 

నా కార్యక్రమాలను నేత్రం వీక్షిస్తున్నది మేధస్సు గమనిస్తూ సరిచేస్తూ సాగిస్తున్నది 
ఆలోచనలు ఇంద్రియ విజ్ఞాన పరిమితితో కార్యక్రమాలను గమనిస్తూ ఎంచుకుంటూ చేసుకుంటూ జీవన విధానాన్ని సాగిస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion