ఖర్చులను చూసుకోకపోతే ఖజానా ఖాళీ అవుతుంది
ఖజానా ఖాళీ ఐతే జీవన విధానం అయోమయ పరిస్థితితో సాగిపోతుంది
దినసరి రోజువారి ఖర్చులను తనిఖీ చేస్తూ సంపాదనను సరిచేసుకోవాలి
అనవసరమైన ఖర్చులను పూర్తిగా తొలగించుకోవాలి అవసరమైన వాటిని కూడా పొదుపుగా చూసుకోవాలి
ఖర్చులు చేస్తూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి ఆరోగ్యమైనా అనారోగ్యమవుతుంది సామర్థ్యం అనాభివృద్ధిగా మారుతుంది
ఖర్చు చేయడం కంటే సంపాదన చేయడమే మహా గొప్ప కార్యం జీవన విధానానికి ప్రధానం అభివృద్ధికి మార్గదర్శకం
కడుపు ఖాళీ ఐతే భరించవచ్చేమో గాని ఖజానా ఖాళీ ఐతే ఎవరూ భరించలేరూ
ఖజానా మ్రోగునట్లు కనకంబు (సువర్ణం బంగారం ఆభరణం) మ్రోగునా
ఖజానా ఉంటేనే కనకం లభ్యమవుతుంది కొనుగోలు చేయవచ్చు
ఖజానాతో విశ్వాన్ని తిరిగిరావచ్చు కనకంతో సమాజంలో జీవించలేవు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion