వేదాలు ఎన్నో ఆవేదనలు ఎన్నెన్నో
బంధాలు ఎన్నో సంబంధాలు ఎన్నెన్నో [నియమాలు ఎన్నో పాఠించాలి]
భావాలు ఎన్నో స్వభావాలు ఎన్నెన్నో
తత్త్వాలు ఎన్నో తాపత్రయాలు ఎన్నెన్నో [పరమార్థాలను ఎన్నో గ్రహించాలి]
రూపాలు ఎన్నో స్వరూపాలు ఎన్నెన్నో
జీవాలు ఎన్నో జీవరాసులు ఎన్నెన్నో [గమనంతో ఎన్నో అవగాహన చేసుకోవాలి]
ఖర్చులు ఎన్నో పొదుపులు ఎన్నెన్నో
కార్యాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో [కార్యాచరణతో కార్యాలను ఉపయోగంగా సాగించాలి]
బోధనలు ఎన్నో సంభాషణలు ఎన్నెన్నో
మాటలు ఎన్నో పరిచయాలు ఎన్నెన్నో [పరిచయాలతో ప్రయోజనం చేసుకోవాలి]
రుచులు ఎన్నో అభిరుచులు ఎన్నెన్నో
అలవాట్లు ఎన్నో పొరపాట్లు ఎన్నెన్నో [పర్యవేక్షణ చేస్తూనే సాగిపోవాలి]
ఎన్నో తెలుసుకోవాలి ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలి
ఎన్నో నేర్చుకోవాలి ఇంకా ఎన్నెన్నో నేర్చేసుకోవాలి [నేర్చుకోవడంతో శ్రమిస్తూనే ఉండాలి]
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion