19, నవంబర్ 2026, గురువారం

జగమంతా జంతర్ మంతర్ గా సాగుతున్నది

జగమంతా జంతర్ మంతర్ గా సాగుతున్నది 
విశ్వమంతా చిత్రాల విచిత్రాలతో వెళ్ళిపోతున్నది 

లోకమంతా లయమై లీనమై పోతున్నది 
జీవ (న) మంతా కార్యమై భావమై సాగిపోతున్నది  

విజ్ఞానమో అజ్ఞానమో కలయికల కార్యాకలాపాలతో సాగుతున్నాయి ఎన్నో కార్యక్రమాలు 
ఆరోగ్యమో అనారోగ్యమో కలయికల కార్యకర్తృత్వములతో సాగుతున్నాయి ఎన్నో కార్యకర్మములు  

కనిపించేది వినిపించేది ప్రతీది అలాగేనని అనుకోవడం పొరపాటుగా తెలుసుకోవడం 
నడిపించేది నిలిపించేది ప్రతీది అలాగేనని అనుకోవడం అలవాటుగా తెలుపుకోవడం 

కార్యములన్నీ యంత్రముల కార్యములై విజ్ఞానమంతా మంత్ర జ్ఞానమై పర భాష ప్రభావితంతో మేధస్సు అనుసంధానమై సాగే జీవన విధానములు జంతర్ మంతర్ గా చిత్రాల విచిత్రాలతో సాగుతూ చూస్తూనే లయమై లీనమై కార్య భావాలు జీవత్వంతో మాయా జాలమై కాలంతో కాలక్షేపంగా ప్రభావితమవుతూ వేళ కాని వేళ కూడా ఆహారం ఆరోగ్యం సమయోచితంగా లేక సాగిపోతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion