ఎద గాలి తెలుపుతుంది ఎదగాలని
ఎద గాలి శ్వాసకు తెలుపుతుంది ఎదుగుతున్నావని
ఎద గాలి దేహానికి తెలుపుతుంది శ్వాసతో ఉన్నావని
ఎద గాలి శ్వాసకు తెలుపుతుంది నీవు జీవిస్తున్నావని
ఎద గాలి ధ్యాసకు తెలుపుతుంది నీవు గమనిస్తున్నావని
ఎద గాలి శ్వాసకు తెలుపుతుంది నీవు కలసిపోతున్నావని
ఎద గాలి ఆత్మకు తెలుపుతుంది నీవు తోడుగా ఉన్నావని
ఎద గాలి తెలుపుతుంది కార్యాలతో ప్రయాస పడుతున్నావని
ఎద గాలి తెలుపుతుంది కార్యాలతో సహించలేక పోతున్నావని
ఎద గాలి తెలుపుతుంది కార్యాలతో సామర్థ్యాన్ని కోల్పోతున్నావని
ఎద గాలి తెలుపుతుంది కార్యాలతో ఆరోగ్యాన్ని కోల్పోతున్నావని
ఎద గాలి తెలుపుతుంది నీవు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని
ఎద గాలి తెలుపుతుంది నీవు పరిపూర్ణంగా జీవిస్తూనే ఉండాలని
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion