26, నవంబర్ 2026, గురువారం

అఖండ జ్యోతిగా వెలిగే సూర్యజ్యోతి ప్రకాశం ఉన్నప్పుడు మరో జ్యోతి అవసరమా

బ్రంహాండంలో విశ్వమంతా అఖండ జ్యోతిగా వెలిగే సూర్యజ్యోతి ప్రకాశం ఉన్నప్పుడు మరో జ్యోతిని అపారంగా వెలిగించడం అవసరమా  

ఆకాశమంత తేజోదయమైన సూర్య కాంతి ప్రకాశం ఉన్నప్పుడు మరో జ్యోతిని వెలిగించే అవసరం ఉంటుందా 
ఏ జ్యోతిని వెలిగించాలన్నా ప్రకృతి పదార్థాన్ని చాలా వరకు ఉపయోగించాలి 

ఒక జ్యోతిని వెలిగించడానికి కావలసిన ప్రకృతి పదార్థాలను ప్రకృతిలో ఉద్భవింపజేయుటకు ఎంత సమయం (నెలలు) ఎంత శ్రమ ఎంత కార్య విజ్ఞాన విధానం అనుకూలమైన ప్రకృతి ప్రదేశం ఎంతటి స్వభావ స్పందన తత్త్వం ఎంతటి పర్యావరణ తీవ్రత కాల ఋతు ప్రభావం అవసరమో ఏ మహాత్మునికైనా తెలుస్తుందా గ్రహించడం సాధ్యమగునా 

ప్రకృతి పదార్థాలు లేకుండా ఏ జ్యోతిని మనం వెలిగించలేము దేనిని మనం సృష్టించలేము 

ప్రకృతి పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం వలన ధరలు అపారంగా పెరుగుతూనే ఉంటాయి వీటితో పాటు ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయి 

మానవ రూపకల్పన ఉత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే ధరలు అంతగా పెరుగుతూనే ఉంటాయి అలాగే వాడుక (ఉపయోగించుకోవడం)ఎంత ఎక్కువగా ఉంటే అంతటి ఎక్కువగా ధరలు పెరుగుతూనే ఉంటాయి వాడుకను ఉపయోగించుకోవడాన్ని ఎంత తక్కువగా చేసుకుంటే ధరలు అంతటి తక్కువగా ఉంటాయి 

ప్రకృతి పదార్థాలను వస్తువులను ఎక్కువగా వాడుకోవడం వలన ఈనాటి ధరలు రేపటికి పెరుగుదలలుగా (అధిక ధరలుగా రెండితలుగా పదింతలుగా) ఊహించలేనంతగా సాగుతాయి 

ఉచితంగా లభించే వాటిని కూడా అధిక ధరలతో విక్రయించవలసిన అవసరం ఏర్పడుతుంది 

చీకటిలో ఉన్నప్పుడు జ్యోతిని వెలిగించండి దాని వెలుగుతో అవసరమైన కార్యాలను సాగిస్తూ త్వరగా పూర్తి చేసుకోండి నేత్ర దృష్టిని దివ్యంగా జీవం ఉన్నంత వరకు ఉంచుకోండి 

ప్రకృతిని అవసరంగా మాత్రమే వాడుకొని ప్రకృతిని అత్యంత పర్యావరణంతో రక్షించండి 

ఆచరణగా వెలిగించే జ్యోతిని అవసరమైనంతగా మాత్రమే కుటుంబ విజ్ఞాన రక్షణ అభివృద్ధి కోసం వెలిగించండి 

మానవుడు వెలిగించే జ్యోతి ఎప్పటికైనా శాంతమవుతుంది 

పంచభూతాలు ప్రకృతిలో వివిధ రకాలుగా పదార్థాలుగా ఉద్బవిస్తూనే ఉంటాయి అలాగే వాటిని పరిమితంగా ఉపయోగించుకోవాలి 

పంచభూతాల అనంత కార్యాల శ్రమను మనం భరించలేము తెలుసుకోలేము గ్రహించలేము పరిశుద్ధమైన భూమిని (అణువు నైనను) మనం సృష్టించలేము 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion