తామే కుటుంబానికి ఆధారమైతే తప్ప శ్రమించలేరు [నోటి దాక వచ్చేదాక ఆకలి విషయం తెలియదేమో]
బంధమై ఉన్నప్పుడు కాలక్షేపం చేస్తూనే జీవించావు [అంతా చేసేవారు ఉన్నప్పుడు ఆసరగా శ్రమించరేమో]
ఆసరగా ఉంటూ భరోసాగా శ్రమిస్తూ సంపాదన చేస్తూ ఉంటే బంధం ఇంకా ఎంతో కాలం ఆరోగ్యంతో సామర్థ్యంతో విజ్ఞానంతో అభివృద్ధితో శుభ కార్యాలతో సాగిపోయేది
ఆసరాగా ఎవరూ లేక ఒక్కరే శ్రమించి అనారోగ్యంతో నిరంతరం అన్ని కార్యాలను నిర్వర్తిస్తూ బంధాన్ని వదిలి త్వరీత కాలంలో వయస్సులో ఉన్నట్టే అలాగే వెళ్ళిపోయారు
శ్రమించడం ఒకరు చెప్పకుండానే ప్రయత్నిస్తూ నేర్చుకుంటూ ప్రారంభించాలి
సంపాదన చేయడం ఒకరి అభివృద్ధికి కుటుంబానికి ఎల్లప్పుడూ భరోసాగ ఉండాలి
ప్రతి ఒక్కరూ శ్రమించాలి ప్రతి సమస్యను పరిష్కారిస్తూ సాగిపోవాలి
ఎటువంటి సమస్యను ఉంచుకోరాదు ఏ అనారోగ్యాన్ని దాచుకోరాదు
ప్రతి ఒక్కరి సంపాదన కుటుంబానికి ఎంతో అవసరం భవిష్య కాలానికి నిదర్శనం అభివృద్ధికి మార్గదర్శకం
సమయాన్ని సమయోచితంగా ఉపయోగించుకోవడమే సంపాదన సంసార సాధన శ్రమించే జీవన బంధన
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion