Sunday, January 9, 2011

నీవు నిర్ణయించిన కాలం సరిపోలేదేమో

నీవు నిర్ణయించిన కాలం సరిపోలేదేమో అందుకే సరి కాదేమో
నీవు నిర్ణయంచిన కాలం కన్నా మరింత సమయం అవసరమేమో
కాలమే కొన్నింటికి సరైన కాలాన్ని సూచిస్తూ తగిన సమయాన్ని తీసుకుంటుంది
కొన్ని కార్యాలు నీవు అనుకున్న సమయం కన్నా తక్కువ కాలంలో పూర్తి కావచ్చు
ఏ పనిని ఎప్పుడు ఆరంభించినా ఎప్పుడు ముగిసినా అంతా కాల నిర్ణయమేనని భావించు
నీ ఆలోచనకు సహకరించే కాలమే మహా దివ్య నిర్ణయంగా విశ్వ సమయమే సూచిస్తుంది
ఎప్పుడు ఏది జరిగినా కష్టమైనా నష్టమైనా భాదైనా అంతా కాల నిర్ణయమేనని భావిస్తూ
ఇంకా గొప్ప ఆలోచనలతో విశ్వ భావాలతో మహా కార్యాలతో విశ్వ నిర్ణేతగా సాగిపో

No comments:

Post a Comment