28, అక్టోబర్ 2023, శనివారం

శివుడివో శివునివో జీవులకే ప్రధానవో

శివుడివో శివునివో జీవులకే ప్రధానవో 
శివన్నవో శివయ్యవో జీవులకే ప్రసిద్ధవో 

శివాయవో శివారివో జీవులకే ప్రజ్ఞాతవో 
శివాద్యవో శివాజివో జీవులకే ప్రజాతవో 

శివంతివో శివప్పవో జీవులకే ప్రభూతవో 
శివాయువో శివానివో జీవులకే ప్రశాంతవో 

నీవే జీవం ఆద్యంత కాల గమనం విశ్వం విశాల మర్మం జగం అనంత రూపం 
నీవే కార్యం అదృశ్య జీవ చలనం విశ్వం విజ్ఞాన సూత్రం జగం ఆంతర్య భావం 

సర్వం తత్వ మోహన ప్రయాణ జీవితం నిత్యం వేద సాధన పుష్కల ప్రకృతం 

సూర్యోదయం అభయ స్వరూపం సర్వాంతర సమయ కారుణ్య జీవిత మార్గదర్శనం   || శివుడివో || 

శ్రీ శ్రీ శివం శ్రీకరం శుభకరం

శ్రీ శ్రీ శివం శ్రీకరం శుభకరం 
శ్రీ శ్రీ శివం శ్రీచరం శుభనయం 
శ్రీ శ్రీ శివం శ్రీచక్రం శుభానందం 

శ్రీ శ్రీ శివం శ్రీధరం శుభప్రదం  
శ్రీ శ్రీ శివం శ్రీరంగం శుభకృతం 
శ్రీ శ్రీ శివం శ్రీతరం శుభసూత్రం  

శ్రీ శ్రీ శివం శ్రీపత్రం శుభగీతం  
శ్రీ శ్రీ శివం శ్రీహస్తం శుభత్రయం  
శ్రీ శ్రీ శివం శ్రీపూర్వం శుభజ్ఞానం 

శ్రీ శ్రీ శివం శ్రీభావం శుభగుణం 
శ్రీ శ్రీ శివం శ్రీకార్యం శుభోదయం  
శ్రీ శ్రీ శివం శ్రీతత్త్వం శుభారంభం  

శ్రీ శ్రీ శివం శ్రీకాంతం శుభధ్రువం 
శ్రీ శ్రీ శివం శ్రీశాంతం శుభధ్యానం 
శ్రీ శ్రీ శివం శ్రీప్రాంతం శుభాస్థితం 

శ్రీ శ్రీ శివం శ్రీపాదం శుభఫలం 
శ్రీ శ్రీ శివం శ్రీనాదం శుభశ్రేష్టం 
శ్రీ శ్రీ శివం శ్రీకాలం శుభసారం 

శ్రీ శ్రీ శివం శ్రీకావ్యం శుభప్రియం 
శ్రీ శ్రీ శివం శ్రీధైర్యం శుభోజయం 

శ్రీ శ్రీ శివం శ్రీహితం శుభవిధం  
శ్రీ శ్రీ శివం శ్రీగ్రంథం శుభంకితం 

శ్రీ శ్రీ శివం శ్రీదైవం శుభధర్మం 
శ్రీ శ్రీ శివం శ్రీభుజం శుభదేహం 

శ్రీ శ్రీ శివం శ్రీతేజం శుభవర్ణం 
శ్రీ శ్రీ శివం శ్రీజీవం శుభజన్మం 

శ్రీ శ్రీ శివం శ్రీశ్రమం శుభలాభం 
శ్రీ శ్రీ శివం శ్రీబంధం శుభలగ్నం 

శ్రీ శ్రీ శివం శ్రీక్రమం శుభకార్యం 
శ్రీ శ్రీ శివం శ్రీభువం శుభస్వయం

నేను లేని దేశమే నీవు జీవించే ప్రదేశమై ప్రపంచమంతా నా వారు జీవించునా

నేను లేని దేశమే నీవు జీవించే ప్రదేశమై ప్రపంచమంతా నా వారు జీవించునా 
నేను లేని స్థానమే నీవు ఎదిగే ప్రస్థానమై పర్యాటకమంతా నా వారు వృద్దించునా 

నేను లేని క్షణమే మీరు జీవించే విశ్వమై విజ్ఞానమంతా మీకు నేనుగా భావమై అందించునా 
నేను లేని కాలమే మీరు సాగించే జగమై ప్రజ్ఞానమంతా మీకు నేనుగా తత్త్వమై ఆవహించునా 

యోగాల భావాలకే యుగాల తత్త్వాలకే అతీతమైన నా దేహం జీవించుటలో శూన్యమై ప్రయాణించునా 
యుగాల దైవాలకే యోగుల దేహాలకే అతీంద్రియమైన నా రూపం జ్ఞానించుటలో శాంతమై ప్రశోధించునా 

మేధస్సులోని భావాలు మనస్సులోని తత్త్వాలు అఖండ దేహాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో విడిచి పోవునో 
వయస్సులోని వేదాలు శిరస్సులోని నాదాలు అపూర్వ దైవాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో కలిసి పోవునో 

జన్మలోనే తెలిసిన సిద్ధాంతం జీవించుటలో సాగించే సూత్రధారి దర్శనం మరణంలోనే యదార్థం ప్రశాంతం అదృశ్యం  

అరుణ గిరి ప్రజ్వలం

అరుణ గిరి ప్రజ్వలం 
సువర్ణ గిరి ప్రచోదనం 

అఖండ గిరి ప్రమోదనం 
అద్భుత గిరి ప్రసంఖ్యం 

ఆధార గిరి ప్రతిష్ఠితం 
సుధార గిరి ప్రఖ్యాతం 

అద్విత గిరి ప్రభూతం 
అపూర్వ గిరి ప్రచురత్వం 

అచ్యుత గిరి ప్రపూర్ణం 
సంచిత గిరి ప్రకృతం 

అరణ్య తత్వాలతో వెలసిన దేహం

అరణ్య తత్వాలతో వెలసిన దేహం 
కారుణ్య భావాలతో నిలిచిన రూపం 

శరణ్య గానాలతో ఒదిగిన స్కంధం 
చరణ్యుః గాత్రాలతో ఎదిగిన శరీరం 

యోగ ప్రయాసాలతో యుగాలుగా సాగించిన ఆద్యంత తత్త్వాలు దేహంలో కఠిన కర్కాటక సాధనమే  || అరణ్య ||  

13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఏనాటిదో మన జీవితం

ఏనాటిదో మన జీవితం 
ఎందరికో మన విజ్ఞానం 

ఎలాంటిదో మన జీవనం 
ఎప్పటిదో మన ఆదర్శం 

ఎక్కడికో మన ప్రయాణం 
ఎంతటిదో మన ప్రభావం 

ఎందరికో మన ప్రశోధనం 
ఎంతటికో మన ప్రతిఫలం 

12, అక్టోబర్ 2023, గురువారం

దేహ తత్వముల చేతనే భావాల స్వభావాలు ఆలోచింపజేయును

దేహ తత్వముల చేతనే భావాల స్వభావాలు ఆలోచింపజేయును 
జీవ తత్వముల చేతనే దేహాల క్రియ స్వభావాలు జీవింపజేయును 

దేహమందు జీవ స్వభావాలు ఆలోచన విధానాలకు మూల కారణాలు 
జీవమందు దేహ స్వభావాలు విచక్షణ విధానాలకు సర్వ కార్యములు 

జీవ దేహమందు కలుగు భావ తత్వాలు జీవితమందు కలుగు కార్య కారణ స్వభావాలు 

మానవ జీవ దేహ మేధస్సులు విజ్ఞానంలో నిరంతరం అనేక విధాల కృషించే శ్రామికులు, నిర్మాణంలో అపార ప్రావీణ్యులు

యోగ ఆసనాలే శరీరానికి ఆరోగ్య కవచాలు

యోగ ఆసనాలే శరీరానికి ఆరోగ్య కవచాలు 
యోగ ఆసనాలే ఆరోగ్యాన్ని అభివృద్ధించే ఆయుస్సు సూత్రాలు 
యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్యంతో సమృద్ధించే శాస్త్రీయములు 
యోగ ఆసనాలే దేహానికి ఆరోగ్యాన్నిచ్చే పరిశుద్ధమైన దివ్య ఔషధాలు 
యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్య తేజంతో పరిజ్ఞానించే మహా మూలికలు 
యోగ ఆసనాలే శరీరానికి సువర్ణ ఆరోగ్యాన్ని కలిగించే అద్భుత ఫలితాలు 

యోగభ్యాసతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు దేహంలోని జీవాన్ని శుద్ధి చేస్తూ శరీరాన్ని తేజస్సుతో దృఢపరుస్తుంది 

సూర్య ప్రభావంతో (సూర్యోదయాన, సూర్యాస్తయాన) కూడిన యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్య పరిచే మహా పరిశుద్ధ ఔషధములు  

ప్రశాంతమైన వాతావరణంలో సూర్య కిరణాల ప్రకాశంతో చేసే యోగ ఆసన విన్యాసాలు దేహాన్ని సమృద్ధి పరిచే మహా దివ్యమైన మూలిక ఔషధాలు ఆయుస్సుకు పరమ కవచాలు మేధస్సుకు మహా గుణ ప్రజ్ఞానములు  

ఔషధము: ప్రకృతి మూలికల సమూహము

మహా దివ్యమైన ఔషధములు, మూలికల ప్రక్రియాలు - సూర్యుని తేజస్సులో దాగిన అమర తత్వములు 
 
మూలికలు (4) : 1. సంధానకరణి, 2. సావర్ణ్య కరణి, 3. సంజీవ కరణి, 4. విశల్య కరణి

సంధానకరణి - చెడిన అవయవములను కూర్చు ఓషధి/ఔషధి 
సౌవర్ణకరణి - ఇది తాకినది బంగారమగునందురు - రక్తాన్ని దేహాన్ని సమర్థంగా సమృద్ధి పరిచేది 
సంజీవకరణి - జీవమునిచ్చు ఓషది (మళ్లీ బ్రతికించే ఔషధి /మందు)
విశల్యకరణి - విరిగిన ఎముకలను అతికించు ఔషధి

ఎన్నడూ లేని జీవంతో యోగ ఆసన తత్వాలతో ఉచ్చ్వాస భరితమై

ఎన్నడూ లేని జీవంతో యోగ ఆసన తత్వాలతో ఉచ్చ్వాస భరితమై నిచ్ఛ్వాస చరితమై సుదీర్ఘమైన బంధాలతో 
ప్రకృతి ప్రభావాల అనుచిత స్వభావాలతో పరిశుద్ధమైన పంచభూతాలతో అమృత ప్రక్రియల సూర్య తేజస్సుతో 
మేధస్సులోనే దేహశుద్ధమై శరీరాకృతమై ఆత్మ పరమాత్మంచే సర్వానుభూతి కాల క్రియల కారుణ్య కర్మోదయంతో 
ధ్యానజ్యోతి గమన పరిపూర్ణంతో అనంత జీవుల విధి వైఫల్య కారణ జనన మరణ ధారణ విధానాలకు నిరంకుశమై 
అంతర్యామిగా అసాధారణగా అపూర్వ కాంతమై నిత్యం ప్రయాణిస్తూనే అదృశ్య జీవమై విశ్వాత్మగా ఉదయిస్తూనే ఉన్నా

మానవా మాధవా నీలో కలిగే భావాలతో శ్రమిస్తున్నావా

మానవా మాధవా నీలో కలిగే భావాలతో శ్రమిస్తున్నావా 
మానవా మాధవా నీలో కలిగే తత్వాలతో సహిస్తున్నావా 

మాధవా మానవా నీలో కలిగే భావాలతో సుఖిస్తున్నావా 
మాధవా మానవా నీలో కలిగే తత్వాలతో మోహిస్తున్నావా 

మానవ జీవుల జీవితాలలో కలిగే భావ తత్వాలు బహిర్గమౌతున్నాయి 
మాధవ జీవుల జీవితాలలో కలిగే భావ తత్వాలు అంతర్గమౌతున్నాయి