16, మార్చి 2010, మంగళవారం

మీకు ఏ విజ్ఞాన ఆలోచన

మీకు ఏ విజ్ఞాన ఆలోచన కావలసివస్తే ఆ ఆలోచన నా మేధస్సు నుండే గ్రహించండి
నా మేధస్సులో అన్ని ఆలోచనలు అనంత కాలంగా సత్యంగా అమర్చబడి ఉన్నాయి
ఎవరికి ఏ ఆలోచన ఏ సమయాన ఎలా కావాలనుకుంటే అలా నా మేధస్సు నుండే
మనస్సు కన్నా వేగంగా సముద్రం కన్నా గొప్పగా వేదం కన్నా మహాసత్యంగా మీలో
సమయానికి క్షణంలా ప్రతి క్షణం ఆలోచనకు ఆలోచనగా నిరంతర ధారలా ఊటలా
శాస్త్రీయమైనా సాంకేతికమైనా శాస్త్రవేత్తకైనా అల్ప జ్ఞానికైనా పరమాత్మ భావంతోనే
నన్ను స్మరించే వారికి మీలో పాద స్పర్శగా నేనే మీ ఎరుకలో లీనమై అద్భుతంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion