Sunday, January 9, 2011

మేధస్సులో ఆలోచన కలిగితేనే తర్వాత

మేధస్సులో ఆలోచన కలిగితేనే తర్వాత కార్యం సాగుతుంది
ఒక క్షణంలో కలిగే ఎన్నో ఆలోచనలను కార్యాన్ని సాగించుటలో నీవు గుర్తించలేవు
నీ మేధస్సులో ఓ క్షణానికి ఎన్నో ఆలోచనలను కార్యమే కలిగించి కొనసాగిస్తుంది
నీకు తెలియకుండానే నీలో నుండి ఎన్నో సూక్ష్మ విజ్ఞాన ఆలోచనలు కలుగుతాయి
మేధస్సులో మహా విజ్ఞాన ఎరుకను గ్రహించ గలిగితేనే ఉపాయాలు గుర్తుంటాయి
ఉపాయాలే మన కార్యాలకు విజ్ఞాన సోపానాలుగా మంచి ఫలితాన్ని ఇస్తాయి
ఓ కార్యాన్ని అనుభవ పూర్వకంగా మహా విజ్ఞానంగా ఆలోచించి ఆరంభించు
రాబోయే కాలం మరో కొత్త సమస్యలతో నీ మేధస్సును ప్రభావితం చేస్తుంది
అన్ని రకాలుగా అన్ని దిక్కులుగా అన్ని కాల ప్రభావాలకు సామర్థ్యాన్ని ఓర్చుకో

No comments:

Post a Comment