Sunday, January 9, 2011

నగరాలలో ప్రతి రోజు పగలు రాత్రి

నగరాలలో ప్రతి రోజు పగలు రాత్రి జాతరగా ఊరేగుతున్నారు
నగరమంతా ఎక్కడ చూసినా వృత్తికై ఎందరో ఎన్నో రకాలుగా
చీమల వలే ప్రయాణిస్తూ జాతరగా ఊరేగుతున్నట్లు అనిపిస్తుంది
ఎవరికి ఏమవుతుందోనని ఏ వాహనం ఎవరికి ప్రమాదమో సందేహంగా
ఆర్ధిక పరిస్థితికై సమాజంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు సందేహాలు
ఎంత విజ్ఞానం ఉన్నా జన సంఖ్యను సమస్యలను తగ్గించ లేము
రాను రాను ఇంకా సమస్యలే గాని జీవన ప్రశాంతత కనిపించడం లేదు

No comments:

Post a Comment