18, జులై 2016, సోమవారం

దైవం మానవ రూపంలో అవతరించును ఈ లోకంలో

దైవం మానవ రూపంలో అవతరించును ఈ లోకంలో
భావం జీవుల దేహంలో ఉదయించును ఈ జగతిలో   || దైవం ||

సర్వం జ్ఞానం ఒక వేదమై మేధస్సులలో సాగేను
జీవం వేదం ఒక విజ్ఞానమై ఆలోచనలలో సాగేను

మౌనం తత్వం మహాత్మునిగా చూపించే భావనలే
దైవం సత్యం పరమాత్మునిగా తలిచే తత్వములే

ప్రాణం కోసమే ప్రేమా బంధం జీవన సంబంధం
మమత కోసమే మనస్సు హృదయం జీవిత అనురాగం  || దైవం ||

నిత్యం సత్యం సర్వం శాంతం ధర్మం నిరంతరం
వేదం జ్ఞానం జీవం కార్యం లోకం విశ్వం సర్వాంతరం

జీవంలో కార్యం మేధస్సులో ప్రయాణం ఒక జీవన గమ్యమే
దేహంలో భావం ఆలోచనలో తత్వం ఒక జీవిత భ్రమణమే

జగతికి సూర్యోదయమే అవతరించును ఈ లోకంలో
విశ్వానికి సూర్యాస్తమే అవధరించును ఈ భువిలో   || దైవం ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion