23, నవంబర్ 2016, బుధవారం

పలికించవా నాలోని స్వరగంగను వినిపించవా నీలోని జలధారను

పలికించవా నాలోని స్వరగంగను ... వినిపించవా నీలోని జలధారను
వెలిగించవా నాలోని స్వరధామను ... ప్రవహింపవా నీలోని జలధాతను
ఉదయింపవా నాలోని స్వరతేజస్సును ... నడిపించవా నీలోని జలగంగను  || పలికించవా ||

నాలో కలిగే స్వర శృతులలో నీ హంసధ్వని రాగం మహా శుభోదయం
నాలో వెలిగే స్వర కాంతులలో నీ అమృతవాహిని రాగం మహోదయం

ఉదయించే విశ్వంలో ఎదిగే ప్రకృతిలో ప్రతి స్పందన నీ జీవోదయం
అస్తమించే లోకంలో ఒదిగే సృష్టిలో ప్రతి వేదాంత భావన నీ నవోదయం  || పలికించవా ||

పలికే స్వర సంగీత సరిగమలు సప్త స్వరాగాల సంపూర్ణ భావత్వం ఓ దివ్యత్వం
పిలిచే స్వర సంగీత పదనిసలు సప్త స్వరాగాల ప్రజ్ఞాన పాండిత్యం ఓ వేదత్వం

ప్రవహించే జలధారలో గంగా ప్రయాణం ఓంకార రాగ సంగీత కీర్తనటనం
వినిపించే జలధామలో గంగా ప్రవాహం ఝంకార గాన సంగీత సంకీర్తనం   || పలికించవా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి