Wednesday, September 18, 2024

శాస్త్రాన్ని చదువుకున్నవాళ్ళే శాస్త్రజ్ఞులా శాస్త్రాన్ని తెలుసుకున్నవారు కూడా శాస్త్రజ్ఞులు కాగలరా

శాస్త్రాన్ని చదువుకున్నవాళ్ళే శాస్త్రజ్ఞులా శాస్త్రాన్ని తెలుసుకున్నవారు కూడా శాస్త్రజ్ఞులు కాగలరా 

శాస్త్రాన్ని నేర్చుకున్నవారే శాస్త్రజ్ఞులా 

శాస్త్రాన్ని శాస్త్రీయంగా అవలంబిస్తూ ఉపయోగిస్తున్నవారు కూడా శాస్త్రజ్ఞులుగా సాగెదరు 
చదువు లేని పూర్వకాలంలో శాస్త్రాన్ని తెలిసినవారే శాస్త్రజ్ఞులై ఎన్నో వివిధ కార్యాలను చేపట్టారు 

ప్రకృతి ధర్మాన్ని గ్రహించడమే శాస్త్రీయం 
ప్రకృతి సహజ ప్రక్రియలు కార్యాల కారణ ఫలితాలు 

కార్య ఫలితం ఉపయోగకరమైతే కార్యాచరణ విధానమే శాస్త్రీయం 

ప్రకృతిపై అవగాహన ఉంటే శాస్త్రాన్ని తెలుసుకోవచ్చు సిద్ధాంతాన్ని గ్రహించవచ్చు సూత్రాన్ని కనుగొనవచ్చు సమస్యను పరిష్కారించవచ్చు 

సూత్రము సంక్షిప్తమైనది 
సిద్ధాంతము వివరణమైనది 
శాస్త్రము కారణమైనది రహస్యమైనది 

శాస్త్రాన్ని సూత్రంగా తెలుసుకుంటే [జ్ఞాపకంగా ఉంచుకుంటే] సిద్ధాంతంగా విశదీకరించవచ్చు రహస్య కారణ విధానాన్ని క్రమంగా గ్రహిస్తూ అర్థం చేసుకోవచ్చు సమస్యలను పరిష్కారించుకోవచ్చు 

ఒక్కొక్క వర్గానికి చెందిన సమస్యలకు ఒక్కొక్క సూత్రం దాగివుంటుంది 

No comments:

Post a Comment