పరమాత్మా! జీవమై ఏ రూపంతో ఉన్నావో
ఏ రూపంలో ఉన్నా నీ భావ తత్వాలను గ్రహించే మేధాశక్తి పరిశుద్ధమైన పరిశోధన ప్రభక్తి ఎవరిలో ఉన్నది ఏనాటికి తెలియనున్నది
ప్రతి జీవిలో ప్రతి అణువులో ఉన్న నీ పంచభూతాల విశ్వ ప్రకృతి భావ తత్వాలను గ్రహించుట కేవలం ఒక పరిశుద్ధమైన ఆలోచనకే తెలియును
నిగూఢమై ఉన్న నీవు మర్మమై ఆత్మ తత్వంచే దేహంలో ప్రవేశించావు ప్రతి అణువులో జీవంలో కార్యాలను శక్తి సామర్థ్యాలను పరిశోధించేవు కాలంతో దృశమై ఉన్నా కాల సమయంతోనే అదృశ్యమై పంచభూతాలలో లీనమై నిలిచెదవు
జీవిస్తూనే మరణించెదవు మరణిస్తూనే జన్మించెదవు - జన్మతో జీవించెదవు
కార్య స్వభావాల తత్వాలను పరిశీలిస్తూ అనుభవిస్తూ కాలంతో సాగిపోయెదవు విశ్వాన్ని నడిపించెదవు
భావాలతో అనంతమై వివిధ తత్వాలచే బ్రంహాండమంతా నిండుకున్నావు
-- వివరణ ఇంకా ఉంది!