దేహానికి కాస్త ఆహారాన్ని అందించవా మాధవ మూర్తి
దేహం చుట్టూ ఎన్నో అద్భుతాలు ఎన్నో మహా రూపములు ఉన్నా తిలకించుటలో దేహం ఆకలితో సాగుతున్నా పరిశుద్ధమైన ఆహారం కోసం గాలిస్తున్నది మహా తత్వ మాధవ మూర్తి
పంచభూతములుగా ఎన్ని సృష్టించుకున్నా దేహానికి ఆహారమే ప్రదానం ఆలోచనయే పరిణామం
ప్రతి రోజు ఎన్నో కార్యాలతో సాగుతున్నా ఆహారం లేకపోతే దేహం విలువ శ్వాస కూడా తెలుపదు మాధవా
ఆహారంతోనే పంచభూతములు శరీర దేహాన్ని రక్షిస్తూ శ్వాసతో ఆరోగ్యాన్ని అందుకుంటూ శక్తి సామర్థ్యాలు కార్యాలుగా చేసుకోగలవు
పంచభూతాల ప్రకృతియే ఆహారాన్ని అందిస్తుంది పంచభూతాల కాలమే ఆహారాన్ని నశింపజేస్తుంది
ఉదయించుటలో ఆహారాన్ని అందిస్తుంది అస్తమించుటలో ఆహారాన్ని అభివృద్ధి చేస్తుంది
అభివృద్ధి ఐనా ఆహారాన్ని ఉదయించుటలో ఉపయోగించుకోలేకపోతే పంచభూతాల కాల సమయంతో ఆహారాన్ని నశింపజేస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment