ఓ మహా దేవా! నీవు ప్రత్యక్షమై మేధస్సును విజ్ఞాన పరచి జీవితాన్ని మహోత్తరంగా మార్చెదవా
జీవించుటలో అజ్ఞానం ఏదో విజ్ఞానం ఏదో స్మరించుటలో కూడా మనస్సుకు మేధస్సుకు దేహస్సుకు తెలియకుండా పోతున్నది
జీవించుటలో ఎంతటి శ్రమ ఉన్నా సహనం తరిగి పోతున్నది సమయం అనారోగ్యమవుతున్నది శ్రద్ధ సామర్థ్యాన్ని కోల్పోతున్నది ఫలితం శూన్యమవుతున్నది
నీవుగా ప్రత్యక్షం కాకపోయినా కనీసం శ్రమకు తగ్గ విజ్ఞాన ఫలితాన్ని ఐశ్వర్య అభివృద్ధిని బంధాల ఆనందాన్ని కలిగిస్తే చాలు సమయానికి సామర్థ్యమైన శ్రమ సంపూర్ణమైన నిద్ర పరిశుద్ధమైన ఆహారం పరిపూర్ణమైన ప్రశాంతత మహోదయమైన అనుబంధం అనుభవమైన విశ్వ విజ్ఞానం శరీర జీవుల దేహాలకు కలుగుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment