సర్వము భర్త నుండే పొందాలంటే అసాధ్యము
అన్నింటిని పొందాలంటే బంధాలను కలుపుకోవాలి బంధాలతో జీవించాలి సంబంధాలతో సామరస్యంగా సాగిపోవాలి
భర్త శ్రమ పైననే ఆధారపడుతూ అన్నింటిని పొందాలంటే సర్వం అన్ని విధాలా తధ్యం కాదు
బంధాల ద్వారా కలిగే అనుభవాలను సుఖ సంతోషాలను ఐశ్వర్య భోగాలను కాల క్రమేణా అనుభవిస్తూ సాగిపోవాలి
భర్త శ్రమలో లోపం ఉంటే ఫలితం లేకపోతే అనుభవాలకు పరమార్థం తెలుసుకోవాలి శ్రమకు తోడుగా నిలవాలి శ్రమలో సమ భాగం పంచుకోవాలి అప్పుడు అనుభవాలు సమపాలలో ఇద్దరికి అన్ని విధాలా అందుతాయి ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది
కాలంతో పాటు అన్నింటిని అనుగ్రహించాలి అన్ని విధాల సమయోచితంగా ప్రయత్నించాలి
భర్తను పరమార్థం చేసుకోకోకపోయినా పరవాలేదు అపార్థం మాత్రం చేసుకోరాదు
ఏ బంధము ఎంత వరకు ఉంటుందో ఎవరికి తెలుసు
ప్రస్తుతం ఉన్న బంధాలతో జీవించాలి వెళ్ళిపోయిన బంధాలను స్మరించుకోవాలి కొత్తగా వచ్చే బంధాలను తెలుసుకొని కలుపుకోవాలి జీవితాన్ని అలా బంధాలతో సాగిస్తూ ముందుకు వెళ్ళాలి అన్నింటిని అర్థం చేసుకోవాలి
అర్థం తెలుసుకోవడం కన్నా పరమార్థాన్ని గ్రహించడం గొప్ప వరం ఉన్నత లక్షణం
మేధావులకు వరముతో కలిగే విజ్ఞానం పరిశోధనా పరమార్థం ఏకాగ్రత గమనార్థం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment