విశ్వ విజ్ఞానాన్ని చదవడం ఆపేస్తావో తెలుసుకోవడం నిలిపేస్తావో అనుభవించడం మరచిపోతావో సంబోధించడం మానేస్తావో నీకే తెలియకుండా పోతుంది
విశ్వ విజ్ఞానం ఎంత ఉందో పరమాత్మకు కూడా తెలియని భావ తత్వాల స్వభావాలు అనంతమైన అణువు పరమాణువుల రూప స్వరూపాల కాల కార్యముల రూపాంతరముల ప్రభావాలు ఎన్నో రకాలుగా నిరంతరం సాగుతూనే ఉంటాయి
విశ్వ విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా రాదు గమనంతో గ్రహించడం ద్వారానే వస్తుంది అర్థాన్ని పరమార్థంగా మార్చుకుంటేనే తెలుస్తుంది
వయస్సును ఆయుస్సుగా చేసుకుంటూ మనస్సును మర్మముగా ధ్యాసతో గమనిస్తూ ఏకాగ్రతను కార్యంతో ఏకీభవిస్తూ అణువు పరమాణువుల ఆచరణ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా అనేక విధాలుగా పరిశీలిస్తేనే పరోశోధిస్తేనే విశ్వ విజ్ఞానం తెలిసేందుకు అర్థమవుతుంది
విశ్వ విజ్ఞానం ఉద్భవిస్తూనే ఉంటుంది కాలంతో పాటు వివిధ మార్పులతో మారుతూ అర్థం పరమార్థం యాదార్థాన్ని తెలుపుతూనే ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion