ప్రసాదాలు తాజాదనంతో పరిశుద్ధంగా ఉన్నప్పుడే పది మందికి (మానవులకు, జనులకు ) వృధా కాకుండా పంచాలి
ప్రసాదాలు తాజాదనంతో ప్రకృతి సృష్టించిన రూపాలతో ఉంటేనే ఏ మానవుడైనా స్వీకరించగలడు ఆస్వాదించగలడు
ప్రసాదాలు ప్రకృతి సృష్టించిన రూపాలతో కాకుండా వివిధ రూపకల్పనలతో వంటకాలుగా తయారుచేస్తే కొందరు మాత్రమే స్వీకరించగలరు ఆశ్వాదించగలరు (ఇష్ట కష్టములుగా గుర్తించగలరు భావించెదరు)
ప్రకృతి అనంతమైన వివిధ రకాల ఆహార పదార్థాలను అమృత తత్వంతో కాల స్థితి భావాలతో అపూర్వమైన స్వభావాలతో అపారమైన శ్రమతో సృష్టిస్తుంది
ప్రకృతి ఇచ్చే ఆహార పదార్థాలను తాజాదనంతో నాణ్యత శ్రేష్టత ఉన్నప్పుడే ఆస్వాదించాలి
ఆహారం ఎంత కావాలో అంతే పరిమాణాలతో వృధా కాకుండా తాజాదనంతో ఆస్వాదించాలి
ఆహారం యొక్క తాజాదనం శరీరానికి ఉత్తేజం ఆరోగ్యం ప్రశాంతత ఆకర్షణీయత విజ్ఞాన యోగ్యతను కల్పిస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment