Wednesday, March 25, 2026

నీవు ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళినా ప్రదేశాలన్నీ పరిశుద్ధంగా ఉండేలా పరిశోధిస్తూ జీవించవా

నీవు ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళినా ప్రదేశాలన్నీ పరిశుద్ధంగా ఉండేలా పరిశోధిస్తూ జీవించవా 

ప్రతి ప్రదేశాన్ని నీవు పరిశుద్ధంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేలా కనిపించాలి  

పరిశుద్ధమైన ప్రదేశాలు ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని ప్రశాంతతను అనుభవాలను అనుబంధాలను కలిగిస్తాయి 

స్వచ్ఛమైన ప్రదేశం పరిపూర్ణమైన పర్యావరణమైన పత్రహరితమైన ప్రాణ వాయువులతో వీచే ప్రాంతంగా జీవులకు ప్రశాంతమైన ఆరోగ్యాన్ని శక్తి సామర్థ్యాలను అందిస్తుంది 

నీ కోసం కాకపోయినా నీవాళ్ళకు తరతరాలుగా స్వచ్ఛమైన ప్రాణ వాయువులు వీచేలా దేహానికి తగినంతగా అందేలా  పరిశుద్ధమైన ఆరోగ్యం ఉండేలా శక్తి సామర్థ్యాలు కలిగేలా ప్రశాంతమైన జీవితాలు శతాబ్దాలుగా యుగ యుగాలుగా నిరంతరం సాగేలా ప్రకృతి పరిపూర్ణంగా ఉద్భవిస్తూ అభివృద్ధి చెందుతూ కాల స్థితులకు అనుగుణంగా సాగాలి  


--  వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment