21, సెప్టెంబర్ 2016, బుధవారం

మాతరం వందే మాతరం

మాతరం వందే మాతరం
భారతం వందే మహా భారతం
ఈ తరం వందే మహోత్తరం
మాతాపితల తరమే మాతరం       || మాతరం ||

జనని జనతా జయహో మాతరం
జగతి జనతా జత జతగా జాతరం
జన గణ మన మమతే మహోత్తరం
జల గల జయ విజయ విజేతరం      || మాతరం ||

దేశం భావం దేహం దైవం భారతం
దేశం స్వదేశం విదేశం సమాంతరం
ప్రభాతం ప్రణామం మన మాతరం
ప్రయాణం ప్రమోదం మన అనంతరం  || మాతరం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి