17, ఆగస్టు 2017, గురువారం

ఎక్కడికో నీ భావన ఎందాకో నీ స్వభావన

ఎక్కడికో నీ భావన ఎందాకో నీ స్వభావన
తెలియని ప్రయాణమై తెలుసుకో ఎందుకో

ఎవరితో నీ వేదన ఎక్కడో నీ తపన
గమనమే సాధనగా గమ్యమే చేరుకో   || ఎక్కడికో ||

ఎక్కడైనా ఆచరణగా నడిచిపో ఆదరణగా మిగిలిపో
ఎప్పుడైనా ఆవేదనగా నిలిచిపో ఆవరణగా ఉండిపో

ఏనాటికైనా కార్యాచరణ కార్యాదరణగా సాగించుకో
ఎప్పటికైనా కార్యావేదన కార్యావరణగా నిలుపుకో    || ఎక్కడికో ||

ఏ కార్యమైనా మూలమే ఆధారణంగా గమనిస్తూ సాగిపో
ఏ భావమైన స్వభావమే సాధారణంగా ధ్యానిస్తూ వెళ్ళిపో

ఎవరితో ఏ భావమైన అధ్యాయంగా అనుభవంతో తెలుసుకో
ఎవరితో ఏ తత్వమైన ఆద్యంతంగా అణుకువతో తెలుపుకో    || ఎక్కడికో ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి