17, ఆగస్టు 2017, గురువారం

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం
మరచిపోలేను గమనాలలో నీ వైభవోత్సవం
అంగరంగ వైభోగమే నీ కళ్యాణ బ్రంహోత్సవం

జగతికి మహా ఉత్సవం విశ్వతికి మహా దైవోత్సవం
ప్రకృతికి మహా సంతోషం జనతికి మహా ఆనందం  || మరవలేను ||

గమనించలేదు నీ భావాలను ఇంతకు ముందెన్నడు
తపించలేదు నీ స్వభావాలను ఇంతకు ముందెన్నడు

వినిపించలేదు నీ స్వరాలు ఇంతకు ముందెన్నడు
కనిపించలేదు నీ తత్వాలు ఇంతకు ముందెన్నడు  || మరవలేను ||

భవిష్య కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా గొప్పదనం
రాబోయే కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా అద్భుతం

తరతరాలుగా సాగే కళ్యాణ రథోత్సవ ఉత్సవం విశ్వతికి మహా బ్రంహోత్సవం
యుగయుగాలుగా సాగే వైభోగ మహోత్సవ సర్వోత్సవం జగతికి మహా శుభోత్సవం  || మరవలేను || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి