22, జనవరి 2018, సోమవారం

నిత్యము నీవే ఉదయిస్తున్నావు

నిత్యము నీవే ఉదయిస్తున్నావు
సర్వము నీవే ప్రజ్వలిస్తున్నావు

అనంతమై నీవే ప్రకాశిస్తున్నావు
ఆద్యంతమై నీవే పరిశోధిస్తున్నావు  

నిత్యము ఉదయించుటలో నీవే విశ్వసిస్తున్నావు
సర్వము ప్రయాణించుటలో నీవే ఆదరిస్తున్నావు  || నిత్యము ||

జీవించుటలో సర్వం నీవే ధ్యానిస్తున్నావు
ఉదయించుటలో నిత్యం నీవే ప్రకాశిస్తున్నావు
పరిశోధించుటలో అనంతం నీవే సమీక్షిస్తున్నావు

అనంతము నీవై బంధాలతో అణువులను దర్శిస్తున్నావు
సమస్తము నీవై కిరణాలతో జీవములను అధిరోహిస్తున్నావు
ఆద్యంతము నీవై కాలంతో పరమాణువులను పరిశీలిస్తున్నావు  || నిత్యము ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి