25, జనవరి 2018, గురువారం

జీవానికే దైవం నీవు ఆలోచనకే అర్థం నీవు

జీవానికే దైవం నీవు ఆలోచనకే అర్థం నీవు
రూపానికే భావం నీవు దేహానికే తత్వం నీవు

కాలానికే తరుణం నీవు కార్యానికే సమయం నీవు
మేధస్సుకే గమనం నీవు హృదయానికే చలనం నీవు   || జీవానికే ||

జగతికే జననం నీవు విశ్వతికే వినయం నీవు
ప్రకృతికే ప్రాణం నీవు శ్రీమతికే శ్రీకారం నీవు

ఆకృతికి ఆకారం నీవు పద్ధతికే పరిశోధనం నీవు
సంస్కృతికే సహనం నీవు సిద్ధాంతికే స్వీకారం నీవు   || జీవానికే ||

స్నేహానికే వచనం నీవు ధర్మానికే హితం నీవు
సువర్ణానికే తేజం నీవు సుగంధానికే సుమం నీవు

యుగానికి యోగం నీవు తరానికి తీరం నీవు
బంధానికి ప్రేమం నీవు స్వరానికే సాగరం నీవు  || జీవానికే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి