16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

ఉచ్చ్వాసతో శ్వాసనే గమనించు ధ్యాసతో ఆయుస్సునే అనుగ్రహించు

ఉచ్చ్వాసతో శ్వాసనే గమనించు ధ్యాసతో ఆయుస్సునే అనుగ్రహించు
ఉచ్చ్వాసతో దేహాన్నే పరిశోధించు స్వధ్యాసతో మనస్సునే పరిశుద్ధించు

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల నిర్ణీత కాలాన్ని నిత్యం సమన్వయంగా శాంత పరచు
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో దేహాన్ని సర్వం అనంత కార్యాలతో ప్రశాంత పరచు  || ఉచ్చ్వాసతో ||

ఏ క్షణం ప్రయాసతో సాగినా దేహాన్ని సమన్వయంగా ఉచ్చ్వాసతో సాగించు
ఏ సమయం దీక్షతో ఉండినా దేహాన్ని నిర్ణీత కాలంతో ఉచ్చ్వాసతో నడిపించు 

ఏ క్షణమైనా దేహానికి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస కాల పరిమితిని సంభోగ పరచు
ఏ సమయమైనా శ్వాసకు ఉచ్చ్వాస నిచ్ఛ్వాస పరిమాణాన్ని సంయోగ పరచు   || ఉచ్చ్వాసతో ||

ఏ కార్యమందు లీనమైనా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై స్వధ్యాసనే కేంద్రీకరించు
ఏ స్వభావమందు లయించినా స్వధ్యాస శ్వాసపై ఆలోచనతో ఏకాగ్రత వహించు

ఏ భావంతో సాగుతున్నా ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనంతో ఆయుస్సును ఆనందపరచు 
ఏ తత్వంతో ఆవహిస్తున్నా శ్వాసపై ధ్యాసను ధ్యాన మననంతో మనస్సును సంతృప్తిపరచు  || ఉచ్చ్వాసతో ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion